Wife : పెళ్లికి ముందే అడిగి తెలుసుకోండి.. భార్య చేసిన పనికి వణికిపోయిన భర్త..!
ప్రధానాంశాలు:
భార్య చేసిన పనికి వణికిపోయిన భర్త.. బీర్ బాటిళ్లతో..!
Wife : పెళ్లికి ముందే అడిగి తెలుసుకోండి.. భార్య చేసిన పనికి వణికిపోయిన భర్త..!
Wife : “పెళ్లికి ముందే ఓసారి ప్రశ్నించండి.. నా తప్పును మీరు చేయోద్దు” అంటూ ఓ యువకుడు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇది సినిమా సన్నివేశం కాదు.. నిజ జీవితంలో చోటుచేసుకున్న దారుణ ఘటన. భార్య చేతిలో తన ప్రాణాలు పోతాయని చెప్పుకొచ్చిన భర్త రాందాస్ తన తృటిలో ప్రాణాలతో బయటపడిన కథ ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపుతోంది.

Wife : భార్య చేసిన పనికి వణికిపోయిన భర్త.. బీర్ బాటిళ్లతో..!
Wife : భర్త బాధితుడు..
వివరాల్లోకి వెళితే, రాందాస్ అనే వ్యక్తిపై తన భార్య స్వప్న కుట్ర పన్నిందని, బీర్ బాటిళ్లతో దాడికి సమాయత్తం చేసింది అని ఆరోపణలు వెలువడ్డాయి. వేరే వ్యక్తులతో కలిసి రాందాస్‌ను చంపేందుకు ఆమె సూత్రధారిగా వ్యవహరించిందట. అయితే రాందాస్ సాహసంతో వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని తన ప్రాణాలను రక్షించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన రాందాస్, “నాకు పెళ్లి తర్వాతే ఆమె అసలు రంగు తెలిసింది.. ఆమె ప్రవర్తన బాగోలేదు. ఎప్పటికప్పుడు గొడవలు, బెదిరింపులు, చివరికి ప్రాణాలకు నష్టం కలిగే స్థాయికి వెళ్లింది అంటూ గోడు వెళ్లబోసుకున్నాడు.
మీడియా ముందు ఎమోషనల్ అయిన రాందాస్, “నాకు ఇలా అయింది కాదు… వేరే వారికి ఇలా జరిగితే ఎలా?” అంటూ ప్రశ్నించాడు. “పెళ్లి తర్వాత జీవితంలో ఇద్దరం కలిసి ఉండాలని అనుకుంటారు. కనుక ఓ నిర్ణయం తీసుకునే ముందు.. మనం ఎవరి జీవితంలోకి అడుగుపెడుతున్నామో తెలుసుకోవాలి” అంటూ యువతకు సందేశం పంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య స్వప్నను విచారించడానికి చర్యలు చేపట్టినట్లు సమాచారం. రాందాస్ చేసిన ఆరోపణలు నిజమైతే, ఇది తలకిందులైన న్యాయ వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు తీసుకురావొచ్చు.