Revanth Reddy : కేసీఆర్‌కి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి.. చివ‌రికి ఏం జ‌ర‌గ‌నుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : కేసీఆర్‌కి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి.. చివ‌రికి ఏం జ‌ర‌గ‌నుంది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :10 January 2025,4:30 am

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : కేసీఆర్‌కి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి.. చివ‌రికి ఏం జ‌ర‌గ‌నుంది..!

Revanth Reddy : గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ Telangana రాజ‌కీయాలు  చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ప‌దేళ్ల పాటు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్.. రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి Revanth Ressy.. కేసీఆర్‌కి మూడు చెరువుల నీళ్లు తాగించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స‌మాచారం. కేసీఆర్. మూడు అక్షరాల ఈ పదం ఓ సంచలనం. అతడే ఓ సైన్యం కొన్నాళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన మాత్రం మౌనం వీడలేదు. దీంతో క్యాడర్ డీలా పడిపోతోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ BRS పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే దండుగా కదిలే వారు. కానీ ఇప్పుడు కేసీఆర్ వాయిస్ వినిపించకపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. పార్టీ కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి.

Revanth Reddy కేసీఆర్‌కి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి చివ‌రికి ఏం జ‌ర‌గ‌నుంది

Revanth Reddy : కేసీఆర్‌కి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి.. చివ‌రికి ఏం జ‌ర‌గ‌నుంది..!

Revanth Reddy రేవంత్ రెడ్డి స‌రికొత్త స్కెచ్..

కేసీఆర్‌పై ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా కూడా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు కురిపించే వారు క‌రువ‌య్యారు. కేసీఆర్‌ KCR అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తరచూ ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ సూచనలు తమకు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కి రావాల‌ని కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు కాంగ్రెస్ మంత్రులు. అయినా కేసీఆర్‌ ఫామహౌస్‌ దాటలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా బయటకు వచ్చింది లేదు. మైక్ పట్టింది లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాలి తుంటికి గాయం కావడంతో రెస్ట్ తీసుకున్నారు కేసీఆర్. గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే.. కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుందంటూ నల్గొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల Parliament elections ప్రచారంలో బిజీగా గడిపారు

ఇప్పుడు కేసీఆర్ కొడుకు అరెస్ట్‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది. కేటీఆర్, హరీశ్‌రావును కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారన్న చర్చ ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. ఇప్పుడైన కేసీఆర్‌ ఫాంహౌస్‌ వీడతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌ రాకుంటే క్యాడర్‌ చీలిపోయే ప్రమాదం ఉంది. పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా, పలువురు ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ Phone Tapping చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి నుంచి అక్రమంగా వందల కోట్లు డబ్బులు వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది