Karnataka Elections : కర్నాటక కోటీశ్వరుల ఎన్నికలు.. సామాన్యుడా చూస్తున్నావా ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Karnataka Elections : కర్నాటక కోటీశ్వరుల ఎన్నికలు.. సామాన్యుడా చూస్తున్నావా ?

Karnataka Elections : ప్రస్తుతం దేశమంతా మాట్లాడుకునేది కర్నాటక ఎన్నికల గురించే. కర్నాటక ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో జేడీఎస్.. ఏ పార్టీ గెలుస్తుంది అనేదానిపై స్పష్టత లేకున్నా కర్నాటక ఎన్నికల్లో బీజేపీ మాత్రం మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నిలుచున్న అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ చూస్తే అందరూ కోటీశ్వరులేనట. అవును.. అది ఏ పార్టీ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :8 May 2023,12:00 pm

Karnataka Elections : ప్రస్తుతం దేశమంతా మాట్లాడుకునేది కర్నాటక ఎన్నికల గురించే. కర్నాటక ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో జేడీఎస్.. ఏ పార్టీ గెలుస్తుంది అనేదానిపై స్పష్టత లేకున్నా కర్నాటక ఎన్నికల్లో బీజేపీ మాత్రం మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నిలుచున్న అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ చూస్తే అందరూ కోటీశ్వరులేనట. అవును.. అది ఏ పార్టీ అయినా కానీ.. ఏ నియోజకవర్గం అయినా కానీ.. అభ్యర్థుల లిస్టు తీస్తే అందులో దాదాపు అందరూ కోటీశ్వరులేనట.

ఒక్కో అభ్యర్థి ఆస్తి సగటుగా రూ.12 కోట్లు. అభ్యర్థులు తమ నామినేషన్ లో తెలిపిన వివరాలు ఇవి. నిజానికి.. నామినేషన్లలో ఎంత తక్కువ ఆస్తి చూపించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు అభ్యర్థులు. వందల కోట్ల ఆస్తి ఉన్నా.. తమకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదంటూ నామినేషన్స్ లో వేస్తుంటారు. అలాంటిది.. నామినేషన్స్ లోనే తమ సగటు ఆస్తి రూ.12 కోట్లు అని ఇచ్చారంటే.. నిజంగా వాళ్ల ఆస్తి ఎంతుండాలి. ఇక.. బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల్లో 216 మంది కోటీశ్వరులేనట. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 215 మంది కోటీశ్వరులట. అసలు కర్నాటకలో ఉన్నదే 224 సీట్లు. అందులో బీజేపీ నుంచి చూసినా.. కాంగ్రెస్ నుంచి చూసినా అందరూ కోటీశ్వరులే కావడం గమనార్హం.

rich candidates contesting in Karnataka Elections

rich candidates contesting in Karnataka Elections

Karnataka Elections : బీజేపీ తరుపున పోటీ చేస్తున్న నేతల్లో 216 మంది కోటీశ్వరులే

ఇక.. జేడీఎస్ పార్టీని తీసుకుంటే.. ఆ పార్టీ నుంచి పోటీకి నిలిచిన వారిలో 170 మంది కోటీశ్వరులేనట. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ తరుపున పోటీ చేసిన వారిలో 190 మంది కోటీశ్వరులేనట. ఇక.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో 215 మంది కోటీశ్వరులు ఉన్నారట. ఏ పార్టీలో చూసినా ఎక్కువ మంది కోటీశ్వరులే బరిలోకి నిలుచున్నారు. ఇక.. తమ తమ నియోజకవర్గాల్లో కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఎలాగైనా గెలవాలని.. ప్రజలకు డబ్బుల ఆశ చూపించడం, బహుమతుల ఆశ చూపించడం, మద్యం ఇలా ఎక్కడ చూసినా కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయి. చూద్దాం మరి.. కర్నాటక ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది