Roja : భ‌ర్త మాట విని రోజా అన్ని కోట్లు పోగొట్టుకుందా.. ఇప్ప‌టికీ ఆ విష‌యంలో బాధ‌ప‌డుతుంది | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Roja : భ‌ర్త మాట విని రోజా అన్ని కోట్లు పోగొట్టుకుందా.. ఇప్ప‌టికీ ఆ విష‌యంలో బాధ‌ప‌డుతుంది

Roja : ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత రోజా పేరు తెగ మారు మ్రోగిపోయింది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాక‌నివ్వ‌నంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ మెజారిటీతో గెల‌వ‌డంతో పాటు డిప్యూటీ సీఎం ప‌దవి ద‌క్కించుకోవ‌డంతో రోజా ఈ మ‌ధ్య బ‌య‌ట క‌నిపించ‌డ‌మే మానేసింది. అయితే రాజకీయాల సంగతి పక్కన పెడితే.. రోజాకు సినిమాల్లో ఒకప్పుడు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అప్పటి కుర్రకారు.. రోజా […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Roja : భ‌ర్త మాట విని రోజా అన్ని కోట్లు పోగొట్టుకుందా.. ఇప్ప‌టికీ ఆ విష‌యంలో బాధ‌ప‌డుతుంది

Roja : ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత రోజా పేరు తెగ మారు మ్రోగిపోయింది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాక‌నివ్వ‌నంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ మెజారిటీతో గెల‌వ‌డంతో పాటు డిప్యూటీ సీఎం ప‌దవి ద‌క్కించుకోవ‌డంతో రోజా ఈ మ‌ధ్య బ‌య‌ట క‌నిపించ‌డ‌మే మానేసింది. అయితే రాజకీయాల సంగతి పక్కన పెడితే.. రోజాకు సినిమాల్లో ఒకప్పుడు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అప్పటి కుర్రకారు.. రోజా అంటే పడి చచ్చిపోయేవాళ్లు. అసలు ఆమె సినిమా రిలీజవుతుందంటే.. థియేటర్‌లకు ఎగేసుకుని వెళ్లిపోయేవారు.

Roja పాపం రోజా..

అయితే రోజా పెళ్ల‌య్యాక సినిమాలు త‌గ్గించింది. బుల్లితెర షోల‌కి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. మంత్రి అయ్యాక వాటికి దూర‌మైంది.. అయితే రోజా నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్న మాత్రం గట్టిగా వినిపిస్తోంది. రోజా టాలీవుడ్ కు వచ్చినా.. కోలీవుడ్ కు వెళ్ళినా.. అక్కడ రజినీకాంత్ ను, ఇక్కడ మెగా ప్యామిలీని ఆమె అనరాని మాటలు అనడం వల్ల.. రోజాకు ఆఫర్లు రావడం కష్టమనే చెప్పాలి. ఇక రోజా తమిళ దర్శకుడు సెల్వమణితో గతంలో ఎక్కువ సినిమాలు చేశారు. మొదటి సినిమా టైమ్ లోనే ఆయనతో ప్రేమలో పడ్డ ఆమె.. 2002 లో అతన్ని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. పెళ్ళి తరువాత కూడా రోజా నటించింది. అంతే కాదు భర్త మాటలు విని ఓ సందర్భంలో రోజా కోట్లకు కోట్లు నష్టపోయిందట. సెల్వమణి వల్ల రోజాకు అంత నష్టం ఎలా వచ్చిందో తెలుసా..?

Roja భ‌ర్త మాట విని రోజా అన్ని కోట్లు పోగొట్టుకుందా ఇప్ప‌టికీ ఆ విష‌యంలో బాధ‌ప‌డుతుంది

Roja : భ‌ర్త మాట విని రోజా అన్ని కోట్లు పోగొట్టుకుందా.. ఇప్ప‌టికీ ఆ విష‌యంలో బాధ‌ప‌డుతుంది

సెల్వమణి దర్శకత్వంలో సుమన్ హీరోగా ఓ సినిమాను రోజా నిర్మించిందట. సమరం టైటిల్ తో రిలీజ్ అయిన ఈ యాక్షన్ మూవీకోసం బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుకు వేయకుండ రోజా ఖర్చు పెట్టారట. ఈ సినిమా పాటలు అద్భుతంగా వెళ్లడంతో సినిమా కూడా హిట్ అవుతుంది అనుకున్నారట. కాని ఈమూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే నెగెటీవ్ టాక్ రావడంతో.. మూవీ ప్లాప్ గా నిలిచిందట. ఈ సినిమా కోసం రోజా పెట్టిన డబ్బంతా ఆవిరై పోవడంతో.. కోట్లలో ఆమె నష్టపోయిందట. చాలా డబ్బు పోగొట్టుకున్న ఈ సినిమా జంట కోలుకోవడం కోసం చాలా టైమ్ పట్టిందని ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది