Actor Sagar : వాడిలా నేను వెన్నుపోటు పొడవను.. అలీపై నటుడు సాగర్ సంచలన వ్యాఖ్యలు వైరల్
ప్రధానాంశాలు:
తెలంగాణలో జనసేన తరుపున పని చేయనున్న సాగర్
జనసేన తరుపున ఎన్నికల ప్రచారం
పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారా?
Actor Sagar : యాక్టర్ సాగర్ తెలుసు కదా. మొగలి రేకులు సీరియల్ తో చాలా ఫేమస్ అయిన నటుడు సాగర్. సాగర్ అనే పేరు కన్నా ఆర్కే నాయుడు అనే పేరుతోనే ఎక్కువగా అందరికీ గుర్తుండిపోయాడు సాగర్. ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నా శాయశక్తులా నేను జనసేన పార్టీ అభివృద్ధికి సహకరిస్తాను అని సాగర్ చెప్పుకొచ్చారు. మీరు ఇంత తక్కువ సమయంలో చేరారు కదా. మీ ప్లాన్ ఏంటి అని మీడియా అడగ్గా.. కళ్యాణ్ గారితో చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ఆయన మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీగా ఓన్ చేసుకున్నారు. జనసేన, బీజేపీ కూటమితో తెలంగాణలో ఎంటర్ అయ్యారు. చాలా తక్కువ టైమ్ లో ఈ పొత్తు కుదిరింది కాబట్టి ఇక ఆ తర్వాత తక్కువ టైమ్ ఉన్నప్పటికీ రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చాడు సాగర్.
నాది రామగుండం. అక్కడే పుట్టి పెరిగారు. విద్య కోసం గుంటూరు, విజయవాడ వెళ్లాను. తెలంగాణ గురించి మాట్లాడితే.. ఇక్కడ సమస్యలు ఏంటంటే, నేను ఇప్పుడే జనసేనకు ఎంట్రీ అయ్యాను. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకొని మా కార్యచరణ ప్రకటిస్తాం. నేను ఇప్పుడే జనసేనలోకి వచ్చాను కాబట్టి ఇప్పుడే మేము తెలంగాణలో ఏం సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము కార్యాచరణ ప్రకటిస్తాం అని సాగర్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తక్కువ సమయంలో పార్టీలో చేరినప్పటికీ.. తెలంగాణ జనసేనకు మద్దతుగా.. ఇక్కడ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు సాగర్ సంసిద్ధం అవుతున్నారు.
Actor Sagar : నాకు తెలంగాణ, ఆంధ్రా రెండు రాష్ట్రాలతో అనుబంధం ఉంది
తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టిసిపేషన్ ఎంత వరకు ఉంటుంది అనేది ఇంకా తెలియదు. ఒక రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది. అప్పటి వరకు మేము తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి అనేది ఇంకా తెలియదు. అందుకే తెలంగాణలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ తర్వాత జనసేన కార్యాచరణ ప్రకటిస్తాం. నేను తెలంగాణ, ఆంధ్రా రెండు రాష్ట్రాలకు చెందిన వాడిని. రెండు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. ఇది నా పొలిటికల్ ఎంట్రీ కాదు. అసలు నన్ను నేను టెస్ట్ చేసుకొని తెలంగాణ జనసేన ఇప్పుడే బేస్ గా ఉంది కాబట్టి.. దాన్ని తెలంగాణలో పూర్తి స్థాయిలో విస్తరించేందుకు మా శాయశక్తులా కృషి చేస్తాం.. అని సాగర్ చెప్పుకొచ్చారు.