సిగ్గులేకుండా అచ్చెన్న పక్కన లోకేష్
Sajjala Ramakrishna : ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎలక్షన్స్ హడావిడి చివరి దశకు చేరుకుంది. అధికార పక్షం, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ నేత అచ్చెన్న నాయుడు లోకేష్ గురించి మాట్లాడిన మాటలు లీకై ఎంతటి అలజడిని సృష్టించిందో అందరు చూశారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ అచ్చెన్న అన్నేసి మాటలన్న తర్వాత కూడా సిగ్గులేకుండా లోకేష్ వెళ్లి ఆయన పక్కన కూర్చోవడం సిగ్గులేనితనానికి నిదర్శనం అన్నారు.
Sajjala Ramakrishna : మళ్లీ అదే అచ్చెన్నాయుడ్ని, లోకేష్ పక్కన
“వీడియోలో లోకేష్ ను అచ్చెన్నాయుడు నానా మాటలన్నారు. ఇప్పుడు మళ్లీ అదే అచ్చెన్నాయుడ్ని, లోకేష్ పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి ఉండదు. చంద్రబాబు షోకాజ్ నోటీసు ఇవ్వలేదు సరికదా కనీసం 2 రోజులు అతడ్ని దూరం కూడా పెట్టలేదు. ఏం జరగలేదన్నట్టు సిగ్గులేకుండా పక్కనపక్కన కూర్చున్నారు. లోకేష్ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన రాష్ట్ర అధ్యక్షుడే అతడ్ని తిట్లు తిట్టి, ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడంటే ఇంకేమనాలి.” అంటూ విరుచుకుపడ్డాడు.
అదే విధంగా గతంలో తిరుపతి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు ఆ హోదా గురించి బీజేపీ నేతలెవరూ మాట్లాడటం లేదు.. అదే సభలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ సయమంలో జనసేన పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతోనే కలిసి ముందుకు వచ్చాడు. మరి అలాంటి నేతలు ఇప్పుడు హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదు. అప్పుడు కలిసి పోటీచేసిన వాళ్ళు, ఇప్పుడు తెర వెనుక చేతులు కలిపి ముందుకు వస్తున్నారు.
ఎవరు ఎలాంటి వాళ్ళో ప్రజలకు బాగానే తెలుసు, ఆ ఇద్దరిలో ఒకరు స్వయంగా నటుడు, మరొకరైనా చంద్రబాబు సహజ నటుడు.. ఈ ఇద్దరు ఆడుతున్న నాటకాలను ప్రజలు గ్రహించారు.. తిరుపతి ఎన్నికల్లో వాళ్లకు తగిన బుద్ధి చెప్పటాతనికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా మెజారిటీ ఎంత వస్తుందనే దానిమీదే ఆలోచిస్తుంటే మరోపక్క మిగిలిన పార్టీలు డిపాజిట్లు కోసం కింద మీద పడుతున్నాయంటూ సజ్జల మాట్లాడటం జరిగింది.