Liquor : మందుబాబులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ ఉండదు..!
ప్రధానాంశాలు:
Liquor : మందుబాబులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ ఉండదు..!
Liquor : భారతదేశంలో సినిమా హాళ్లలో మద్యం అమ్మకానికి సంబంధించి ఎలాంటి జాతీయ విధానం లేకపోవడం వల్ల ఈ విషయంపై రాష్ట్రాలకే పూర్తి అధికారం ఉంది. కొన్ని రాష్ట్రాలు ఈ అంశాన్ని సమర్థంగా అనుసరిస్తూ థియేటర్లలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తే, మరికొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాయి. ప్రత్యేక అనుమతులు, కఠిన నిబంధనలతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ అమ్మకాలు జరుగుతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై స్పష్టత లేకుండా పోయింది.

Liquor : మందుబాబులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ ఉండదు..!
Liquor ఏంచక్కా థియేటర్ లోనే మందేస్తూ సినిమా చూడొచ్చు
ఇటీవల పీవీఆర్ ఐనాక్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు తమ థియేటర్లలో మద్యం అమ్మకాలకు అనుమతి కోరుతూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాయి. బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాల్లో మద్యం అమ్మే అనుమతిని ప్రభుత్వాలు మంజూరు చేస్తే, ఆదాయం పెరగడంతో పాటు ప్రేక్షకులకు వన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనుభూతిని అందించగలమని సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టి, దాని ఫలితాల ఆధారంగా విస్తరణపై ఆలోచిస్తామని పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం తెలిపింది.
అయితే ఈ చర్యపై సామాజిక వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు థియేటర్లలో మద్యం అమ్మకం వల్ల ఆదాయం పెరుగుతుందంటూ సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ప్రజల భద్రతకు, ముఖ్యంగా మహిళలకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం ప్రభావంతో థియేటర్లలో గందరగోళం పెరిగే అవకాశముందని, వీటిని మద్యం దుకాణాలుగా మార్చకూడదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని దృష్ట్యా, ఈ విధానంపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో, తుది నిర్ణయం ఏంటో చూడాలి.