Sonia Gandhi : తెలంగాణ ప్రజలు అమ్మ స్థానాన్ని ఇచ్చారు.. రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి సోనియాగాంధీ..!
ప్రధానాంశాలు:
Sonia Gandhi : తెలంగాణ ప్రజలు అమ్మ స్థానాన్ని ఇచ్చారు..
Sonia Gandhi రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి సోనియాగాంధీ..!
Sonia Gandhi : తెలంగాణ Telanganaలో అసెంబ్లీ ఎన్నికల telangana elections 2023 పోలింగ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. ఓటు వేయడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ప్రచారానికి తెర కూడా పడింది. 30వ తేదీన పోలింగ్ జరగటానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 199 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. అయితే దేశంలో తెలంగాణతోపాటు ఎన్నికలు నిర్వహించే మధ్యప్రదేశ్, ఛతీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరంలో ఇప్పటికే పోలింగ్ కూడా పూర్తయింది. అయితే ఈ రాష్ట్రాల కౌంటింగ్ కూడా డిసెంబర్ 3న జరగనుంది. ఇక ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు జోరుగా పాల్గొన్నాయి. అయితే చివరి రోజున కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. బహిరంగసభలో ఆమె ప్రసంగించాల్సి ఉంది.
కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వలన ఆమె పర్యటన క్యాన్సిల్ అయింది. అయితే సోనియా గాంధీ ప్రచారానికి రాకపోయినా ఓ వీడియో విడుదల చేశారు. ఈనెల 30వ తేదీన జరగబోయే పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ Congress కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం పోరాడి ఇచ్చిన వారి కలను సహకారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తనకు అమ్మ స్థానాన్ని ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటర్లు తమ ఓటు హక్కు కోసం ఉపయోగించుకోవాలని కోరారు.
అందరం కలిసి దొరల తెలంగాణని ప్రజా తెలంగాణగా మార్చుదాం అని పిలుపునిచ్చారు. నేను మీ వద్దకు రాలేకపోతున్నా, కానీ మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు. మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మ అని పిలిచి చాలా గౌరవం ఇచ్చారు. మీ ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని అన్నారు. జై తెలంగాణ అంటూ వీడియోను ముగించారు. అయితే కొద్ది రోజులుగా సోనియాగాంధీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ బాధ్యత తీసుకొని ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రచారానికి రాలేని సోనియాగాంధీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఈ వీడియో విడుదల చేశారు