vijayawada mayor : విజయవాడ టీడీపీ దూకుడు..వైసీపీ బేజారు.. కథ అడ్డం తిరిగిందా.. ?
vijayawada mayor : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల హంగామా నడుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని విజయవాడ మేయర్ స్థానం పై యావత్తు రాష్ట్ర ప్రజానీకం దృష్టి సారించిందనే చెప్పాలి. ఈ స్థానంలో గెలుపు కోసం అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు కూడా గట్టిగానే పోరాటం చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు చూసుకుంటే ఈ విషయంలో టీడీపీ ఒక మెట్టు పైనే ఉందని చెప్పాలి.
ఇప్పటికే తెలుగుదేశం అభ్యర్థి ఎవరు అనేది ఫైనల్ చేశారు . విజయవాడ ఎంపీ కేశినేని నాని పంతం నెగ్గిందనే చెప్పవచ్చు. కేశినేని కూతురు శ్వేతను టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో టీడీపీలో గ్రూపు రాజకీయాలకు తెరపడింది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ, టీడీపీ నేత నాగుల్ మీరా టీడీపీ మేయర్ అభ్యర్థిపై అభ్యంతరం వ్యక్తం చేసినా అధిష్ఠానం మాత్రం కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ ముగ్గురు నేతలు కూడ ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో టీడీపీ ప్రచారం ఊపందుకుంది. కేశినేని ఇప్పటికే ఒకసారి విజయవాడ మొత్తం ప్రచారం చేశాడు.
vijayawada mayor : అయోమయంలో వైసీపీ
మరోపక్క వైసీపీ ఇప్పటికి కూడా మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఫైనల్ చేయలేదు. వైసీపీ నాయకుడు గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖితారెడ్డి, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో బ్రాహ్మణుల ఓట్లు పెద్ద ఎత్తున ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బండి పుణ్యశీల పేరు మేయర్ అభ్యర్థిగా తెరమీదకు తీసుకువచ్చారు. విజయవాడలో గెలవాలంటే కాపులనుకానీ, బ్రాహ్మణులను కానీ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఓట్లు కొల్లగొట్ట వచ్చని పార్టీలు అంచనా వేస్తున్నాయి. అందుకే పుణ్యశీల పేరు ప్రస్తుతానికి అక్కడ వినిపిస్తుంది. మేయర్ సీటు వైసీపీ కి దక్కితే అప్పుడు ఏమైనా మార్పులు జరిగిన జరగవచ్చు.
ప్రధానంగా విజయవాడలో రాజధాని తరలింపు విషయం వైసీపీ కి చిక్కులు తెచ్చిపెడుతుంది. ఏప్రిల్ నుండి విశాఖ కేంద్రంగా పరిపాలన చేయబోతున్నామని గతంలో ప్రకటించిన వైసీపీ మంత్రులు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని అధిష్టానం నుండి హెచ్చరికలు రావటంతో దాని గురించి మాట్లాడటం లేదు. అదే కాకుండా వైసీపీ గెలిచిన తర్వాత ఇంటి పన్నులు పెంచే అవకాశం ఉందని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది.
ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వరస ఎన్నికలు ఉండటంతో దానిని వాయిదా వేసింది. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అయిన వెంటనే దానిని అమలుచేసే అవకాశం ఉందని, అలా చేస్తే 5 రేట్లు పన్నులు పెరుగుతాయని. అదే టీడీపీ అధికారంలోకి వస్తే పన్నులు పెంచే పని చేయబోమని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.. ఇవన్నీ చూస్తే విజయవాడ లో టీడీపీకే కొంచం ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తుంది.