TDP : టీడీపీలో కౌన్ బ‌నేగా ఎమ్మెల్సీ.. వ‌ర్మ‌నా లేక ఉమానా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : టీడీపీలో కౌన్ బ‌నేగా ఎమ్మెల్సీ.. వ‌ర్మ‌నా లేక ఉమానా..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 February 2025,8:20 pm

ప్రధానాంశాలు:

  •  TDP : టీడీపీలో కౌన్ బ‌నేగా ఎమ్మెల్సీ.. వ‌ర్మ‌నా లేక ఉమానా..!

TDP ప్ర‌స్తుతం టీడీపీ TDP లో ప‌రిస్థితి వేరేలా ఉంది. మరో రెండు వారాల్లో ఎమ్మెల్సీ కాబోయే లక్కీ లీడర్లు ఎవరంటూ నేతలు చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20 ఎన్నిక జరగనుంది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేస్తేనే ఎన్నిక ఉంటుంది. ఐదుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేస్తే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం కూటమికి ఉన్న బలంతో ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.

TDP టీడీపీలో కౌన్ బ‌నేగా ఎమ్మెల్సీ వ‌ర్మ‌నా లేక ఉమానా

TDP : టీడీపీలో కౌన్ బ‌నేగా ఎమ్మెల్సీ.. వ‌ర్మ‌నా లేక ఉమానా..!

TDP  నువ్వా..నేనా?

ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన నేతలకు ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తామని గతంలోనే ముఖ్యమంత్రి Chandrababu చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ MLC  రేసులో ముందున్న Pitapuram పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ Varma , మాజీ మంత్రి Devineni Uma  దేవినేని ఉమా వంటివారు టెన్షన్ కు గురవుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం Pawan Kalyan పవన్ కల్యాణ్ కోసం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేశారు.దాంతో వర్మకు టెన్షన్ తప్పదని అంటున్నారు.

ఇక తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కోసం సీటు వదులుకున్న సీనియర్ నేత దేవినేని ఉమా కూడా ఎమ్మెల్సీ చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఏర్పడిన ఖాళీల్లో ఉమాకు చాన్స్ ఇస్తారా? లేదా? అనేది ఉత్కంఠకు గురి చేస్తోంది. వర్మ, ఉమానే కాదు టీడీపీలో చాలా మంది సీనియర్లు ఎమ్మెల్సీ రేసులోకి దూసుకొస్తున్నారు. మార్చి 10న ఈ టెన్ష‌న్‌కి సంబంధించి క్లారిటీ వ‌స్తుంది

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది