టీడీపీ మ‌రో షాకింగ్ నిర్ణ‌యం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

టీడీపీ మ‌రో షాకింగ్ నిర్ణ‌యం..!

 Authored By himanshi | The Telugu News | Updated on :2 April 2021,4:10 pm

TDP : ఏపీలో అధికార పార్టీ ఆగడాలకు నిరసనగా తాము పరిషత్‌ ఎన్నికల పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశాడు. కొత్త సీఎస్‌ వచ్చిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ ను విడుదల చేయడం జరిగింది. పాత నోటిఫికేషన్‌ ను యధావిధిగా కంటిన్యూ చేయాలని ఇప్పటికే నామినేసన్‌ లు జరిగిన నేపథ్యంలో అక్కడ నుండే ఎన్నికల పక్రియ అనేది మొదలు పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంను ఏర్పాటు చేశారు. పరిషత్‌ ఎన్నికల విషయంలో చర్చించిన పొలిట్‌ బ్యూరో చివరకు ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.

TDP : వైకాపా వైకరికి వ్యతిరేకంగా..

బుదవారం నాడే ఎన్నికలను బహిష్కరించబోతున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికి పొలిట్‌ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తాజాగా పార్టీ నాయకత్వం మీటింగ్‌ లో వైకాపా వైకరికి వ్యతిరేకంగా ఎన్నికలను బహిష్కించాల్సిందిగా నిర్ణయానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. పొలిట్‌ బ్యూరో సభ్యుల్లో మెజార్టీ మెంబర్స్‌ పరిషత్‌ ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేశౄరు. ఇదే సమయంలో ఇప్పటికే నామినేషన్‌ లు వేసిన ప్రతి ఒక్క అభ్యర్తి కూడా తమ నామినేషన్‌ల ను ఉపసంహరించుకోవాలంటూ ఆదేశించింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా పోటీ చేయవద్దంటూ ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

tdp party

tdp party

TDP : చంద్రబాబు ఇది స‌రైన నిర్ణ‌య‌మేనా..?

తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ అవినీతికి పాల్పడుతుందని అక్రమాలకు పాల్పడుతుందని ఇలా ఎన్నికలను బహిష్కరించడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదంటూ ఆరోపణలు వస్తున్నాయి. పరిషత్‌ ఎన్నికల విషయంలో తెలుగు దేశం పార్టీ భయపడి వెనకడుగు వేసిందని అంటున్నారు. పంచాయితీ ఎన్నికలు మరియు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఘోర పరాభవం తప్పదనే ఉద్దేశ్యంతోనే పరిషత్‌ ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు నాయుడు దూరంగా ఉంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదంటున్నారు. చంద్రబాబు నాయుడు తలతిక్క నిర్ణయంగా కొందరు అభివర్ణిస్తున్నారు. ప్రజా స్వామ్యంపై నమ్మకం ఉన్న వారు ఎన్నికలను బహిష్కరించరు. చంద్రబాబు నాయుడుకు నమ్మకం లేకపోవడం వల్లే ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది