Telangana Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఆ నేతలకు షాకిచ్చిన హైకమాండ్
ప్రధానాంశాలు:
పాలేరు నుంచి పొంగులేటి బరిలో
ఖమ్మం నుంచి తుమ్మల బరిలో
మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో
Telangana Congress : తెలంగాణలో ఎన్నికల సమరం ఆరంభమైంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికలకు మూడు నెలల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటీవల 55 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు లేని అభ్యర్థుల లిస్టును ముందు విడుదల చేసింది కాంగ్రెస్. ఆ తర్వాత రెండో జాబితాను తాజాగా విడుదల చేసింది. రెండో జాబితాలో 45 మందిని విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను ఈసారి స్క్రీనింగ్ కమిటీ చూసుకుంది.
తమకు ఎలాగైనా టికెట్ దక్కుతుంది అని భావించిన కొందరు నేతలకు ఈ లిస్టులో కూడా టికెట్ దక్కలేదు. ఇక.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గాన్ని కేటాయించింది హైకమాండ్. రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపించినా.. ఎల్బీనగర్ ను మధఉ యాష్కీ గౌడ్ కు కేటాయించారు. ఇక ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కగా.. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ఇక.. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖకు టికెట్ దక్కగా.. పాలకుర్తి నుంచి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి టికెట్ దక్కలేదు. ఆమెకు భారత పౌరసత్వం లభించకపోవడంతో పాలకుర్తిని యశశ్వినికి కేటాయించారు.