Telangana Elections 2023 : తెలంగాణ ఎలక్షన్స్ పుణ్యమా అని సోషల్ మీడియాకు భారీ ఆదాయం .. ఎన్ని కోట్లు వచ్చాయంటే ..??
ప్రధానాంశాలు:
Telangana Elections 2023 : తెలంగాణ ఎలక్షన్స్ పుణ్యమా అని సోషల్ మీడియాకు భారీ ఆదాయం .. ఎన్ని కోట్లు వచ్చాయంటే ..??
Telangana Elections 2023 : సోషల్ మీడియా వినియోగం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. తాజాగా సోషల్ మీడియా తెలంగాణ ఎలక్షన్స్ లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకు త్వరగా చేరాలంటే సోషల్ మీడియాకు మించిన వేదిక మరొకటి కనిపించడం లేదు. అందుకే అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది సోషల్ మీడియా. అన్ని పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా సోషల్ మీడియాకు భారీగా ఖర్చు చేశారు. ఎన్నికల్లో అభ్యర్థుల పరిమితి 40 లక్షల దాటకుండా ఉండాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనూ సోషల్ మీడియా నిర్వాహణ కూడా ఉండేలా చూసుకోవాలి.
పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున సాగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 29 లోపు ఓటర్లు 72 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపుగా పది లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఇక వీళ్లంతా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లే. వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే పొలిటికల్ పార్టీలు బాగానే ఖర్చు చేశాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ అత్యధికంగా 10.7 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ పథకాలు, రామక్క, బలగం సినిమా నటులు, సోషల్ మీడియా మెంటర్లు, యూట్యూబర్లు, మై విలేజ్ షో, పెయిడ్ ఇంటర్వ్యూలు ఇలా అన్ని కలిపి వందలాది ప్రకటనలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా డంప్ చేసింది. కేవలం 26 రోజుల్లోనే భారీగా ప్రకటనలను వేయించింది.
బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ బిజెపి చాలా తక్కువ. విపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కు పోటీగా సోషల్ మీడియా ప్రచారానికి 91 లక్షలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు మరొక మూడు కోట్ల వరకు ఖర్చు చేసింది. మొత్తం 150 ప్రకటనలు రూపొందించింది. ఒక్క ఫేస్ బుక్ కోసమే కాంగ్రెస్ 92 లక్షలు కేటాయించింది. Google ప్రకటనలకు కూడా 8 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా 90 రోజులకు చేసిన ఖర్చు. ఇక బీజేపీ కూడా సోషల్ మీడియాకు ప్రచారానికి బాగానే ఖర్చు చేస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పోలిస్తే చాలా తక్కువే. సోషల్ మీడియా ప్రకటనల కోసం బీజేపీ 90 లక్షల వరకు ఖర్చు చేసింది. ప్రింట్ ఎలక్ట్రానిక్ గూగుల్ యాడ్స్ కోసం కూడా భారీగానే ఖర్చు చేసింది. ఇందుకోసం సుమారు నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ మూడు పార్టీలే కాకుండా బిఎస్సి, జనసేన, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమకు ఉన్నంతలో ఖర్చు చేశారు. దీంతో తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని సోషల్ మీడియాకు భారీగానే ఆదాయం సమకూరింది.