Pawan Kalyan : ఆంధ్రా రాజకీయాలు మీద పెట్టిన ఆసక్తి తెలంగాణలో పెట్టి ఉంటే ఇప్పటికే సీఎం అయ్యేవారు.. పవన్‌ను ప్రశ్నించిన తెలంగాణ జనసేన నేతలు
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన 2014లోనే జనసేన పార్టీ పెట్టారు. అది ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. కానీ.. తెలంగాణలో ఆ పార్టీని అంతగా యాక్టివ్ చేయలేదు పవన్ కళ్యాణ్. కానీ.. ఏపీలో అయితే పవన్ కళ్యాణ్ పార్టీని ఏపీలోనే ఎక్కువగా బలోపేతం చేస్తున్నారు. కానీ.. తెలంగాణలో పార్టీ అంతగా యాక్టివ్ లో లేదు. దీంతో తెలంగానలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కాస్త అసంతృప్తికి లోనవుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయలేదు. కనీసం తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అయినా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ను తెలంగాణ జనసేన నేతలు అడిగారు.
తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన ప్రాబల్యం ఉంది. ఈ సారి మాకు అవకాశం ఇస్తే మేము తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉందని నిరూపించుకుంటాం అని జనసేన నేతలు చెప్పుకొచ్చారు. గతంలో పోటీ చేసినప్పుడు మనకు బాగానే ఓట్లు వచ్చాయి. మెంబర్ షిప్ కూడా పెరిగింది. ఈసారి మీరు ఖచ్చితంగా పోటీ చేయండి.. మేము మద్దతు ఇస్తామని తెలంగాణ ప్రజలు చెబుతున్నారు. తెలంగాణలో బలమైన వ్యక్తిగా మేము మద్దతు ఇస్తామని అంటున్నారు అని నేతలు చెప్పుకొచ్చారు. ఈసారి ఖచ్చితంగా చేస్తే మంచిగా ఉంటుంది. గతంలో చాలా తక్కువగా పోటీ చేశాం. కొన్ని కార్పొరేషన్లలో పోటీ చేశాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కొన్ని చోట్ల గెలిచాం.. కొన్ని చోట్ల రెండో ప్లేస్ లో ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చతంగా ఈసారి పోటీ చేస్తే బాగుంటుందని నేతలు పవన్ కళ్యాణ్ కు సూచించారు.
Pawan Kalyan : ప్రతి గడపలో జనసేన జెండా పట్టుకునే వ్యక్తి ఉన్నాడు
తెలంగాణ రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి గడపలో జనసేన జెండా పట్టుకునే వ్యక్తి ఉన్నాడు. అందుకే ఈసారి జనసేన పార్టీని తెలంగాణలో చాలా చోట్ల పోటీ చేయిస్తేనే మన పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని జనసేన పార్టీ నియోజకవర్గాల ఇన్ చార్జీలు అందరూ పవన్ కు సూచించారు. మరి.. దీనిపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.