Telangana Politics: తాటి వ్యాఖ్య‌ల్లో అంత‌ర్యం ఏమిటి.. ఖ‌మ్మం టీఆర్ఎస్‌లో ఏం జ‌రుగుతున్న‌ది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Politics: తాటి వ్యాఖ్య‌ల్లో అంత‌ర్యం ఏమిటి.. ఖ‌మ్మం టీఆర్ఎస్‌లో ఏం జ‌రుగుతున్న‌ది..?

 Authored By nagaraju | The Telugu News | Updated on :4 September 2021,10:04 am

Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న ప్ర‌భావం పెంచుకున్న అధికార టీఆర్ఎస్‌కు ఖ‌మ్మం జిల్లాలోని అశ్వ‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం మాత్రం ఇప్ప‌టికీ అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలింది. నియోజ‌వ‌ర్గ నేత‌ల్లో వ‌ర్గ‌పోరే ఇందుకు కార‌ణ‌మ‌ని ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని అన్నెపురెడ్డి మండ‌లంలో జ‌రిగిన జెండా పండుగ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తాటి వెంక‌టేశ్వ‌ర్లు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర‌మంత‌టా బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మాత్రం అంత బ‌లంగా క‌నిపించడం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. జిల్లాలు నాయ‌కులు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయ‌డం లేద‌ని అసంతృప్తి వ్య‌క్తంచేశారు. ఐక్య‌త లేక‌నే ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓడిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా అదే ప‌రిస్థితి రాకూడ‌దంటే మంత్రి జోక్యం చేసుకోవాల‌ని, అంద‌రూ క‌లిసి ప‌నిచేసేలా చేయాల‌ని తాటి వెంక‌టేశ్వ‌ర్లు సూచించారు.

Telangana Politics: జిల్లా గిరిజనుడికి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వాలి..

Thati Venkateswarlu | MLA | Sarapaka | Burgampahad | TRS

అంతేగాక‌, రాష్ట్రంలో త్వ‌ర‌లో చేప‌ట్ట‌నున్న ఆరు నామినేటెడ్ ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లో ఒక‌టి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని గిరిజ‌న సామాజికవ‌ర్గ నేత‌కు కేటాయించాల‌ని డిమాండ్ తాటి డిమాండ్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు టీఆర్ఎస్ జిల్లాలో గిరిజ‌నుల‌కు ఒకే ఒక్క ప‌ద‌వి ఇచ్చింద‌ని, ఇప్పుడు వాళ్లు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లియార‌ని చెప్పారు. కాబ‌ట్టి కొత్త‌గా చేప‌ట్ట‌బోయే ఎమ్మెల్సీ నియామ‌కాల్లో గిరిజ‌నుడికి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. అయితే, త‌న వ్య‌క్తిగత అభిప్రాయ‌మ‌ని చెప్పారు.

ఎమ్మెల్యే మెచ్చా టీఆర్ఎస్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత‌నే తాటి ప‌లుకుబ‌డి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింద‌ని స్థానికులు చెబుతున్నారు. మెచ్చా పార్టీలోకి రాక‌ముందు కార్య‌క్ర‌మాల్లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన తాటి, ఇప్పుడు ఏ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌న్నా ఇబ్బంది ప‌డుతున్నట్లు పార్టీలో చ‌ర్చ జరుగుతున్న‌ది. కాగా, తాటి వ‌ర్గీయులు మాత్రం పార్టీప‌ట్ల త‌న బాధ్య‌త, గిరిజ‌న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆయ‌న ఈKK వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు.

nagaraju

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది