Khammam District : ఖమ్మం జిల్లా క్లీన్ స్వీప్.. కాంగ్రెస్ పార్టీ ఖతర్నాక్ వ్యూహం
Khammam District : ప్రస్తుతం ఏ పార్టీ చూసినా ఖమ్మం జిల్లా మీదనే ఫోకస్ పెట్టింది. అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద ఫోకస్ పెట్టడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదో గెలిచామా అంటే గెలవడం కాదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లను గెలుచుకొని అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవకుండా క్లీన్ స్వీప్ చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన.
ఉమ్మడి ఖమ్మలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని అనుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందండోయ్. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మంలో భారీ ఫాలోయింగ్ ఉన్న పొంగులేటి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఇక జలగం వెంకట్రావుకి కూడా ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కలేదు. ఈ ముగ్గురు నేతలు ఖమ్మం జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలే. ఈ ముగ్గురు నేతలతో ఖమ్మంలో త్రిశూల వ్యూహం అమలు చేయాలనేది కాంగ్రెస్ ప్లాన్.నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నా కూడా పాలేరు, కొత్తగూడెం, ఖమ్మం ఈ మూడు నియోజకవర్గాలే కీలకం. ఈ మూడు నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే మిగితా నియోజకవర్గాల్లో కూడా అదే పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Khammam District : పాలేరు, కొత్తగూడెం, ఖమ్మం.. ఈ మూడు నియోజకవర్గాలే టార్గెట్
పొంగులేటిని పాలేరు నుంచి పోటీలోకి దింపి, ఆ తర్వాత కొత్తగూడెం నుంచి జలగంను బరిలోకి దింపి ఖమ్మం నుంచి తుమ్మలను పోటీ చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. ఖమ్మంలో అయితేనే తుమ్మలకు సెట్ అవుతుందని.. కమ్మ సామాజిక వర్గం కూడా అక్కడే ఎక్కువ కాబట్టి తుమ్మల కాంగ్రెస్ లో చేరితే అక్కడి నుంచి పోటీ చేయించి మొత్తానికి ఉమ్మడి ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పక్కాగా వ్యూహం రచిస్తోంది. మరి.. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.