Kashmir Pahalgam Video : ఉగ్రదాడి సమయంలో మానవత్వాన్ని చాటిన ముస్లిం యువకుడు.. వీడియో..!
ప్రధానాంశాలు:
Kashmir Pahalgam video : ఉగ్రదాడి సమయంలో మానవత్వాన్ని చాటిన ముస్లిం యువకుడు
Kashmir Pahalgam video : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో తాజాగా జరిగిన ఉగ్రదాడి సమయంలో ఓ ముస్లిం వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి పర్యాటకులను రక్షించడమే కాకుండా, మానవత్వానికి నిజమైన నిర్వచనంగా నిలిచాడు. తుపాకుల మోతలు మారుమోగుతున్న వేళ, ప్రజలు భయంతో పరుగులు తీస్తుండగా, ఈ యువకుడు మాత్రం గాయపడ్డ ఓ పర్యాటకుడిని భుజాన ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నా, అసలు వెనక్కి అడుగువేయకుండా సాహసంతో ముందుకెళ్లాడు.

Kashmir Pahalgam Video : ఉగ్రదాడి సమయంలో మానవత్వాన్ని చాటిన ముస్లిం యువకుడు
Kashmir Pahalgam video రియల్ హీరో అంటే ఇతడే.. తుపాకీ బుల్లెట్లకు ఏమాత్రం భయపడకుండా టూరిస్టులను కాపాడాడు
గాయపడ్డ పర్యాటకుడిని రక్షించేందుకు తుపాకుల వర్షం మధ్యలో అడుగులు వేసిన ఈ యువకుడి ధైర్యానికి పలువురు పోలీసు అధికారులు, స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. “ఇది మానవతా ధర్మం, నేను చేసిందేమీ గొప్ప కాదు” అంటూ ఈ సాహసి తన దర్యసాహసాలను , గొప్పతనాన్ని ప్రదర్శించాడు. తన మతానికి కంటే ముందు మానవత్వాన్ని నిలబెట్టిన ఈ వ్యక్తి ఉదాహరణగా మారాడు. ఇతని చర్య వల్ల గాయపడిన పర్యాటకుడికి తక్షణ చికిత్స అందేలా చేసి ప్రాణాలను రక్షించగలిగారు.
ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను తాకింది. మతం కంటే మానవత్వమే గొప్పదని ఈ ముస్లిం యువకుడి చర్య మరోసారి నిరూపించింది. సమాజం అంతటా అసహనం, విద్వేషం పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు అందరికీ మనిషితనాన్ని గుర్తు చేస్తాయి. ధైర్యం, వినమ్రత, సేవా భావం కలిసిన ఈ యువకుడిని దేశం అభినందిస్తోంది. అతని పేరు తెలియకపోయినా, అతని పని ఎప్పటికీ మరువలేనిది.
రీల్ కాదు.. రియల్ హీరో
ఉగ్రదాడి వేళ.. తన ప్రాణాలను పణంగా పెట్టి, టూరిస్టులను కాపాడిన ఓ ముస్లిం వ్యక్తి
తుపాకుల వర్షం కురుస్తున్నా.. గాయపడ్డ పర్యాటకుడ్ని భుజాన ఎత్తుకొని మరీ పరుగులు
మతం కాదు మానవత్వమే ముఖ్యమని.. ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడిన హీరో#PahalgamTerroristAttack pic.twitter.com/BkyXWGLPXv
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 23, 2025