Zipline Operator : జిప్‌లైన్ ఆపరేటర్ కు ఉగ్రదాడి ముందే తెలుసా..? అందుకే అల్లాహో అక్బర్ అన్నాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zipline Operator : జిప్‌లైన్ ఆపరేటర్ కు ఉగ్రదాడి ముందే తెలుసా..? అందుకే అల్లాహో అక్బర్ అన్నాడా..?

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Zipline Operator : జిప్‌లైన్ ఆపరేటర్ కు ఉగ్రదాడి ముందే తెలుసా..? అందుకే అల్లాహో అక్బర్ అన్నాడా..?

Zipline Operator  : పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి కేసులో జిప్‌లైన్ ఆపరేటర్‌పై ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించి పర్యాటకుడు రిషి భట్ తీసిన సెల్ఫీ వీడియోలో జిప్‌లైన్ ఆపరేటర్ “అల్లాహో అక్బర్” అంటూ నినాదాలు చేస్తున్నది స్పష్టంగా వినిపిస్తుంది. ఉగ్రదాడికి కాసేపటిలోనే కాల్పుల శబ్దాలు అక్కడ గుప్పుమన్నాయి. దీనివల్ల ఆపరేటర్‌కు ఉగ్రదాడి జరగబోతుందని ముందే సమాచారం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Zipline Operator జిప్‌లైన్ ఆపరేటర్ కు ఉగ్రదాడి ముందే తెలుసా అందుకే అల్లాహో అక్బర్ అన్నాడా

Zipline Operator : జిప్‌లైన్ ఆపరేటర్ కు ఉగ్రదాడి ముందే తెలుసా..? అందుకే అల్లాహో అక్బర్ అన్నాడా..?

Zipline Operator : NIA అదుపులో జిప్‌లైన్ ఆపరేటర్..ఉగ్రవాదులతో సంబంధం..?

ఈ ఘటనకు సంబంధించి జిప్‌లైన్ ఆపరేటర్ ప్రవర్తనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిషి భట్‌ను జిప్‌లైన్‌లోకి పంపే ముందు చేసిన నినాదాలు ఉద్దేశపూర్వకంగా జరిగాయా? ఉగ్రవాదుల రాక గురించి అతనికి ముందే సమాచారం ఉందా? అనే అనుమానాలు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పరిశీలనలో ఉన్నాయి. కాల్పుల ధ్వని, జిప్‌లైన్ ఆపరేటర్ వ్యవహారం క్రమంగా ఒక కుట్ర భాగంగా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.

ప్రస్తుతం జిప్‌లైన్ ఆపరేటర్‌ను NIA ప్రశ్నిస్తున్నది. అతని సంబంధాలు, ఆ ప్రాంతంలో జరిగిన కదలికలపై పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఆయన సెల్‌ఫోన్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎవరిలోనైనా అనుమానితులతో సంబంధాలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భద్రతా విభాగాలు మరింత అప్రమత్తమయ్యాయి. కేసు మరింత లోతుగా సాగుతున్నదంతో త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి రావొచ్చని అంచనా.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది