Today Gold Price : గోల్డ్ ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?
ప్రధానాంశాలు:
Today Gold Price : గోల్డ్ ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?
Today Gold Price : గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరిన నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ప్రతీకార సుంకాలను 145 శాతం పెంచడంతో, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం కీలక పెట్టుబడి మార్గంగా మారుతోంది.

Today Gold Price : గోల్డ్ ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?
Today Gold Price పరుగులు పెడుతున్న పసిడి ..ఈరోజు తులం ఎంత ఉందంటే !
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.93,380కి చేరింది. 22 క్యారెట్ల ధర తులానికి రూ.85,610గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల బంగారం తులం ధర రూ.70,050గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా రూ.2,940 పెరిగి తులానికి రూ.93,530 పలికింది. ఇదే విధంగా ముంబైలో రూ.93,380 ధర నమోదైంది. ఒక్కరోజులోనే పదిగ్రాముల బంగారం ధర రూ.3 వేల వరకు పెరగడం గమనార్హం.
బంగారంతోపాటుగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ముంబైలో వెండి ధర కిలోకు రూ.95,000కి చేరగా, హైదరాబాద్‌లో రూ.5 వేలు పెరిగి రూ.1.07 లక్షలు గరిష్ఠానికి చేరింది. పారిశ్రామిక రంగాల నుంచి కొనుగోళ్లు పెరగడం వెనుక దీనికి కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1% పెరిగి 3,116 డాలర్లకు, వెండి ధర 30.96 డాలర్లకు చేరింది. అయితే గమనించాల్సిందేమంటే, బంగారం ధర రోజులో అనేకసార్లు మారుతుంటుంది. కొనుగోలు సమయంలో మార్కెట్ రేటును బట్టి ధర నిర్ణయించబడుతుంది.