Today Telugu Breaking News : రజినీ సాయిచంద్‌ పదవి రద్దు చేసిన రేవంత్ ప్రభుత్వం.. కేసీఆర్ కు కోమటిరెడ్డి పరామర్శ.. బస్సులో మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్.. సస్పెండ్ చేసిన అధికారులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Telugu Breaking News : రజినీ సాయిచంద్‌ పదవి రద్దు చేసిన రేవంత్ ప్రభుత్వం.. కేసీఆర్ కు కోమటిరెడ్డి పరామర్శ.. బస్సులో మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్.. సస్పెండ్ చేసిన అధికారులు

Today Telugu Breaking News : రజినీ సాయిచంద్(Rajini Saichand) సహా 54 కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నామినేటెడ్ నియామకాలను తెలంగాణ నూతన ప్రభుత్వం రద్దు చేసింది. యశోదా ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్(KCR) ను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పరామర్శించారు. అంతకుముందే చిన్నజీయర్ స్వామి కేసీఆర్ ను పరామర్శించారు. రామోజీ రావు(Ramoji Rao) కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కు ఉత్తరం రాశారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) వెంకట్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 December 2023,8:30 pm

ప్రధానాంశాలు:

  •  యశోదా ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ ను పరమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

  •  రాష్ట్రంలో పలు కార్పొరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

  •  మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి

Today Telugu Breaking News : రజినీ సాయిచంద్(Rajini Saichand) సహా 54 కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నామినేటెడ్ నియామకాలను తెలంగాణ నూతన ప్రభుత్వం రద్దు చేసింది.

యశోదా ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్(KCR) ను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పరామర్శించారు. అంతకుముందే చిన్నజీయర్ స్వామి కేసీఆర్ ను పరామర్శించారు.

రామోజీ రావు(Ramoji Rao) కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కు ఉత్తరం రాశారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కేసీఆర్ ను ఆసుపత్రిలో పరామర్శించారు.

నిజామాబాద్ లో ఆర్టీసీ కండక్టర్(Nizamabad RTC Conductor) మహిళకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సర్వీస్ అని చెప్పినా వినకుండా టికెట్ కొట్టడంతో కండక్టర్ నర్సింహులును విధుల నుంచి అధికారులు తప్పించారు. విచారణకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు.

ఛత్తీస్ ఘడ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్(VishnuDev Sai) ని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.రమణ్ సింగ్ ను బీజేపీ అధిష్ఠానం పక్కన పెట్టింది. మోదీ తొలి కేబినేట్ లో విష్ణుదేవ్ సింగ్ సహాయ మంత్రిగా పని చేశారు.

కాంగ్రెస్ గ్యారెంటీ అంటేనే అవినీతి దోపిడీకి గ్యారెంటీ అని బీజేపీ నేత లక్ష్మణ్(BJP Leader Laxman) అన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు అయి రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మంత్రి పొంగులేటి(Ponguleti).. హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. ఇతర మంత్రులు కూడా హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యలపై మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చి 48 గంటల్లో మొదటి ప్రాధాన్యతగా మహిళల హామీని అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను మంత్రి తుమ్మల(Tummala) ప్రశ్నించారు. భట్టి సమర్ధుడు కాబట్టే ఆయనకు ముఖ్యమైన శాఖలను అప్పగించారని కొనియాడారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది