Today Top Telugu News : కేసీఆర్‌కి చంద్రబాబు, భట్టి, చిరంజీవి, ఆర్ఎస్పీ పరామర్శ.. అయ్యప్ప మాల వేసుకున్న చిన్నారికి స్కూల్‌లో నో ఎంట్రీ.. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్.. నిరుద్యోగులకు రేవంత్ తీపి కబురు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Top Telugu News : కేసీఆర్‌కి చంద్రబాబు, భట్టి, చిరంజీవి, ఆర్ఎస్పీ పరామర్శ.. అయ్యప్ప మాల వేసుకున్న చిన్నారికి స్కూల్‌లో నో ఎంట్రీ.. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్.. నిరుద్యోగులకు రేవంత్ తీపి కబురు

Today Top Telugu News : యశోద ఆసుపత్రిలో(Yashoda Hospital) చికిత్స పొందుతున్న కేసీఆర్(KCR) ను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పరామర్శించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి(Narendra Chaudary), ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen kumar) కేసీఆర్ ను కలిసి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆయన సాధారణ జీవితం ప్రారంభించాలని కోరారు. కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై(TamiliSai) ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్

  •  యశోద ఆస్పత్రిలో కెసిఆర్ ను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

  •  కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు

Today Top Telugu News : యశోద ఆసుపత్రిలో(Yashoda Hospital) చికిత్స పొందుతున్న కేసీఆర్(KCR) ను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పరామర్శించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి(Narendra Chaudary), ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen kumar) కేసీఆర్ ను కలిసి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆయన సాధారణ జీవితం ప్రారంభించాలని కోరారు. కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై(TamiliSai) ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆమె కోరారు.

వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) తన పదవికి రాజీనామా చేశారు. అలాగే.. వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో వైసీపీ పార్టీ మంగళగిరి ఇన్ చార్జ్ గా గంజి చిరంజీవి(Ganji Chiranjeevi)ని నియమించింది. తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ఆర్కే మీడియాకు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని బండ్లగూడ(Bandlaguda Private school)లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అయ్యప్ప మాల వేసుకున్న ఓ చిన్నారిని స్కూల్ లోకి అనుమతించలేదు. దీంతో గంట పాటు చిన్నారి ఎండలోనే నిలబడింది. అనంతరం తన తండ్రికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న చిన్నారి తండ్రి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్(Madhya Pradesh Chief minister mohan yadav) ను బీజేపీ అధిష్ఠానం(BJP) ప్రకటించింది. గతంలో మోహన్ యాదవ్ మంత్రిగా పని చేశారు. ఉజ్జయిని సౌత్ నుంచి మోహన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు.

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీపి కబురు చెప్పారు. ఉద్యోగాల భర్తీపై రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించి.. ఖాళీ భర్తీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar Arrest) ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ లోని టైకూల్ జంక్షన్ వద్ద ఉన్న వీఐపీ రోడ్డును పోలీసులు మూసేశారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగగా.. వాళ్లకు మద్దతుగా నాదెండ్ల అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో నాదెండ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

2024 సెప్టెంబర్ 30 కల్లా జమ్ము కశ్మీర్(Jammu Kashmir) లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. వెంటనే కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

క్రికెట్ లో స్టాపింగ్ క్లాక్(Stopping Clock) పేరుతో కొత్త రూల్ ను తీసుకురానున్నారు. ఐసీసీ ఈ రూల్ ను తీసుకు వచ్చింది. స్టాపింగ్ క్లాక్ అంటే.. ఒక ఓవర్ ముగియగానే.. మరో ఓవర్ ను ముందు ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోనే అంటే ఒక్క నిమిషంలోనే వేసేందుకు రెడీ అవ్వాలి. లేదంటే.. బ్యాటింగ్ జట్టుకు 5 రన్స్ ఇస్తారు. ఇది కేవలం గేమ్స్ త్వరగా పూర్తి అవడం కోసమే తీసుకొస్తున్నట్టు ఐసీసీ వెల్లడించింది.

బ్లాక్ మనీని ఎలా రూపుమాపాలో అర్థం కావడం లేదంటూ ఒకప్పుడు ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు(Congress MP Dheeraj Sahu) ఇంట్లో తాజాగా రూ.350 కోట్ల నల్లధనం బయటపడింది.

వైసీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి(YCP Gajuvaka MLA Son Devan Reddy) కొడుకు దేవన్ రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం దేవన్ రెడ్డి వైసీపీ గాజువాక ఇన్ చార్జ్ గా ఉన్నారు. దేవన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం అడగగా హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక