Today Telugu Breaking News : నాకోసం ట్రాఫిక్ ఆపకండి.. రేవంత్ కీలక నిర్ణయం.. 80 లక్షల అప్పు తీర్చలేక భార్యాపిల్లలను చంపి గన్ మెన్ ఆత్మహత్య.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Telugu Breaking News : నాకోసం ట్రాఫిక్ ఆపకండి.. రేవంత్ కీలక నిర్ణయం.. 80 లక్షల అప్పు తీర్చలేక భార్యాపిల్లలను చంపి గన్ మెన్ ఆత్మహత్య.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా

 Authored By kranthi | The Telugu News | Updated on :15 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

  •  మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మా.. ఎన్‌కౌంటర్‌లో హతం

  •  విడుదలకు సిద్ధంగా వ్యూహం మూవీ

Today Telugu Breaking News : తన కోసం రోడ్డు మీద ట్రాఫిక్ ను ఆపొద్దని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నతాధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ ని తీసుకెళ్లాలన్నారు. సాధారణ ట్రాఫిక్ తో పాటే తన కాన్వాయ్ ని అనుమతించాలని అధికారులను ఆదేశించారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్(Siddipet Dist Collector) వద్ద గన్ మెన్ గా పని చేస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ అప్పుల బాధతో భార్య, పిల్లలను తుపాకీతో కాల్చి, తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనా టైమ్(Corona Time) లో కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఎక్కడున్నాడు? తుఫాను టైమ్ లో ఎక్కడున్నాడు? నేను నా కొడుకు పేర్ని కిట్టు ప్రాణాలకు తెగించి సహాయం చేశాం అని పేర్ని నాని(Perni Nani) ప్రశ్నించారు. అలాగే.. ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ ఫర్ ఉంటుందా అని అంటున్నావ్. మరి నువ్వు చంద్రగిరి నుంచి కుప్పంకు ఎందుకు ట్రాన్స్ ఫర్ అయ్యావు చంద్రబాబు అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan reddy) ప్రభుత్వమే మళ్లీ రావాలని ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు(AP minister sidiri appalaraju) అన్నారు.

టెన్షన్ లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఎవరి సీటు మారుతుందోనన్న ఉత్కంఠలో వైసీపీ ఎమ్మెల్యే(YCP Mlas)లు ఉన్నారు. తాడేపల్లి నుంచి ఎవరికి పిలుపు వస్తుందోనని ఆందోళనగా ఉన్నారు. ఉదయం కేబినేట్ మీటింగ్ కు వచ్చిన మంత్రుల మధ్య కూడా ఇదే చర్చ నడిచింది.

అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమా(Vyuham Movie) ఆపలేరని ముందే చెప్పా. వ్యూహం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం. కానీ ఎవరికీ ఓటు వేయాలని చెప్పను అని వ్యూహం సినిమా ప్రెస్ మీట్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) అన్నారు.

ఇన్ చార్జ్ ల మార్పులపై చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన ఆరోపణలకు మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అంబటి స్పష్టం చేశారు. సత్తెనపల్లి అభ్యర్థి ఎవరు అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని అంబటి అన్నారు.

మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మా(Naxalite Hidma encounter)ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా మృతి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలో హిడ్మాపై రూ.14 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు.

ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్(Mumbai Indians Captain) గా హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను ఖరారు చేశారు.

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) కొత్త మార్గాలపై సీఎం రేవంత్(CM Revanth Reddy) ప్లాన్ బీని ప్రకటించారు. గత ప్రభుత్వం చెప్పిన మార్గాలు కాకుండా కొత్త మార్గాలపై ఫోకస్ పెట్టారు. శంషాబాద్ వరకు న్యూ అలైన్ మెంట్ ఉంటుందని ప్రకటించారు. ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు కొత్తగా రెండు మార్గాలను సూచించారు. దీంతో రాయదుర్గం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోకు రేవంత్ సర్కార్ బ్రేక్ వేసినట్టయింది.

ఏపీలో పర్యటించి పంట నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది. ఈసందర్భంగా కేంద్ర బృందంతో సీఎం జగన్(AP CM YS Jagan) భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. మిచౌంగ్ తుఫాన్ నష్టం అంచనాలపై చర్చించారు.

ఏపీ కేబినేట్(AP Cabinet Meeting) భేటీలో పలు అంశాలను చర్చించారు. ఈనెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు. మొత్తం 45 అంశాలపై కేబినేట్ చర్చించింది. పెన్షన్ రూ.3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది