Farmers : గుడ్‌న్యూస్… 12 వేలు కాదు.. ఏకంగా 15 వేలు..?
ప్రధానాంశాలు:
Farmers : గుడ్‌న్యూస్... 12 వేలు కాదు.. ఏకంగా 15 వేలు..?
Farmers : రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి రావల్సి ఉండగా, కనీసం 15-20 క్వింటాళ్లు కూడా రావడం లేదని లబోదిబోమంటున్నారు. అయితే పంటను సాగుచేయడానికి ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. పసుపు పంటకు మద్దతు ధర 15 వేలు ఉంటేనే రైతుకు లాభం అని పసుపు రైతులు అంటున్నారు.
![Farmers గుడ్‌న్యూస్ 12 వేలు కాదు ఏకంగా 15 వేలు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Farmers.jpg)
Farmers : గుడ్‌న్యూస్… 12 వేలు కాదు.. ఏకంగా 15 వేలు..?
పసుపు పంటను ఒక ఎకరంలో సాగు చేయాలంటే ఒక లారీ పశువుల పేడ, ఎరువులు, పసుపు విత్తనం, పసుపు తవ్వడం, ఉడకబెట్టడం ఇలా అంతా కలుపుకొని సుమారు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నారు. మార్కెట్లో ఎనిమిది నుంచి 12 వేల లోపే ధర ఉంది. దీంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి దిగుబడి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు వస్తుంది. పదివేల లోపు ధర ఉంటే లాభం సంగతి దేవుడెరుగు మాకు మాత్రం నష్టమే అన్నారు.
పసుపు పంటను సాగు చేసేందుకు ఖర్చులు ఎక్కువయ్యాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు పసుపు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదన్నారు. పసుపు పంటకు 15000 పైన ధర ఉంటే కచ్చితంగా పసుపు సాగు మరింత పెరుగుతుందని రైతు తెలిపారు. ప్రభుత్వం వీరి బాధలను అర్థం చేసుకొని రూ.15 వేలు మద్దతు ధర కల్పిస్తే.. చాలా మందికి ఊరట కలుగుతుందని అనుకోవచ్చు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.