Husbands : చెరో మూడు రోజులు భర్తని పంచుకున్న ఇద్దరు భార్యలు.. మిగతా ఒక రోజు..!
ప్రధానాంశాలు:
Husbands : చెరో మూడు రోజులు భర్తని పంచుకున్న ఇద్దరు భార్యలు.. మిగతా ఒక రోజు..!
Husbands : బీహార్‌లో ఒక విచిత్రమైన కేసు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పూర్ణియా జిల్లాలో ఒక భర్తను ఇద్దరు భార్యలు రోజుల వారీగా పంచుకున్నారు. వారానికి మూడు రోజులు మొదటి భార్యతో, మరో మూడు రోజులు రెండవ భార్యతో ఉండేలా భర్త, భార్యలిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఒక రోజు సెలవు ఇచ్చారు.

Husbands : చెరో మూడు రోజులు భర్తని పంచుకున్న ఇద్దరు భార్యలు.. మిగతా ఒక రోజు..!
Husbands ఇదేం గొడవ..
రూపౌలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసి ఏడేళ్ల క్రితం మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు కూడా కన్నారు. ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. తన భర్త రెండవ వివాహం చేసుకున్నాడని తెలియగానే, మొదటి భార్య పలు ఆరోపణలు చేసింది. అయితే భార్య ఫిర్యాదుతో శిక్ష తప్పదని హెచ్చరించారు.భర్త తన తప్పును అంగీకరించి, తన మొదటి భార్య, పిల్లల వద్దకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ అతని రెండవ భార్య అతన్ని అడ్డుకుంది.
మొదటి భార్యను కలవడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడల్లా, రెండవ భార్య తనను బెదిరిస్తుందని భర్త చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవలతో అతను విసిగిపోయాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ సెంటర్ సభ్యులు పెద్ద భార్యతో నాలుగు రోజులు, రెండవ భార్యతో మూడు రోజులు ఉండాలని నిర్ణయించారు. అయితే, పెద్ద భార్యతో నాలుగు రోజులు ఉండడంపై మళ్ళీ గొడవ మొదలైంది. పెద్ద భార్యతో భర్త మూడు రోజులు, చిన్న భార్యతో మూడు రోజులు ఉండవచ్చని కేంద్రం తీర్పు ఇచ్చింది. ఆ మితిమీరిన గొడవ చూసి, భర్తకు ఒక రోజు సెలవు ఇచ్చారు.