Nara Lokesh VS Ambati : చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఏడ్చేసిన లోకేశ్.. ఆడదానిలా ఏడుస్తావ్ ఏంట్రా.. అంబటి పంచ్ అదుర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nara Lokesh VS Ambati : చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఏడ్చేసిన లోకేశ్.. ఆడదానిలా ఏడుస్తావ్ ఏంట్రా.. అంబటి పంచ్ అదుర్స్

Nara Lokesh VS Ambati : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. చంద్రబాబు అరెస్ట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి ఇప్పటికే నెల రోజులు దాటింది. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ రాలేదు. ఎన్ని బెయిల్ పిటిషన్స్ వేసినా అన్నీ రద్దవుతున్నాయి. ఏ కోర్టుకు వెళ్లినా ఆయనకు బెయిల్ మాత్రం రావడం లేదు. అసలు బెయిల్ వస్తుందో లేదో కూడా తెలియడం లేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే చంద్రబాబును అక్రమంగా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 October 2023,3:00 pm

Nara Lokesh VS Ambati : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. చంద్రబాబు అరెస్ట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి ఇప్పటికే నెల రోజులు దాటింది. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ రాలేదు. ఎన్ని బెయిల్ పిటిషన్స్ వేసినా అన్నీ రద్దవుతున్నాయి. ఏ కోర్టుకు వెళ్లినా ఆయనకు బెయిల్ మాత్రం రావడం లేదు. అసలు బెయిల్ వస్తుందో లేదో కూడా తెలియడం లేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఫైర్ అవుతున్నారు. నారా లోకేష్ వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే బాధేస్తోంది. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు. 45 సంవత్సరాలు క్రమ శిక్షణతో పట్టు వదలకుండా మనకోసం పని చేశారు. ఆయన్ను రాజమండ్రి జైలులో పెట్టారు. ఇప్పటికి 43 రోజులు అవుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ మెంట్ కేసులో 30 మంది దాకా నిందితులు అని తేల్చారు. ప్రజా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ నారా లోకేశ్ వెక్కి వెక్కి ఏడ్చారు.

దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నారా చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయి 44 రోజులు అవుతోంది. ఒక్క ఈకేసులోనే కాదు. ఇంకా అనేక కేసుల్లో ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో  కూడా ఆయన మీద కేసులు పెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ముందు అరెస్ట్ చేశారు. మిగితా కేసుల మీద కూడా ఆయనపై అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ముందస్తు పిటిషన్లు వేసి అరెస్ట్ చేయకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని క్వాష్ పిటిషన్ కూడా వేశారు. అవి ఏసీబీ కోర్టులో, ఇతర కోర్టులో కొట్టేయబడింది. కానీ.. సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆయనకు ఒకే ఒక్క రిలీఫ్ వచ్చింది ఏంటంటే.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి.. దానికి ఏసీ అవసరం అని.. ఏసీ ప్రొవైడ్ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నారా చంద్రబాబు నేరాలకు పాల్పడ్డాడు అనే దాని మీద అన్ని ఆరోపణలు సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్ష్యాధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. అందువల్లనే ఏ కోర్టులోనూ రిలీఫ్ రావడం లేదు. అన్ని కోర్టులు కూడా ఆయన్ను విచారణ చేయాలనే చెప్పాయన్నారు.

war of words between nara lokesh versus ambati rambabu

#image_title

Nara Lokesh VS Ambati : తలా తోక లేని మాటలు మాట్లాడిన నారా లోకేష్

న్యాయవాదులు కూడా కోర్టులో గందరగోళానికి గురి చేసి అవతలి న్యాయవాదిపై దౌర్జన్యం చేసే పరిస్థితి చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ ఏం మాట్లాడారు.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తే 154 మంది గుండెలు పగిలి మరణించారట. అసలు అటువంటి దాఖలాలు అయితే మాకు కనిపించలేదు. ఈ నెల 25 నుంచి నిజం గెలవాలి అని భువనేశ్వరి 154 మంది చనిపోయిన వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు అని అంటున్నారు. ఆయన కొడుకు నారా లోకేష్.. టీడీపీ ఆఫీసులో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి తలా తోక లేని మాటలు మాట్లాడారు. నారా లోకేష్ మాట్లాడుతూ ఏడ్చేశాడు. అతడు ఆవేదన చెందడంలో తప్పు లేదు కానీ.. చంద్రబాబు కూడా శాసనసభలో సవాల్ చేసి బయటికి వెళ్లి మీడియా ముందు ఏడ్చారు. చంద్రబాబు ఏడుపులో డ్రామా ఉంది.. లోకేష్ ఏడుపులో ఆవేదన ఉంది.. అని అంబటి చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది