Ysrcp : టికెట్ ఇస్తావా… లేక ఇండిపెండెంట్‌గా బరిలో నిల్చోవాలా.. జగన్‌కు తెగేసి చెప్పిన ఆ నేత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : టికెట్ ఇస్తావా… లేక ఇండిపెండెంట్‌గా బరిలో నిల్చోవాలా.. జగన్‌కు తెగేసి చెప్పిన ఆ నేత

Ysrcp : ఒకే పార్టీలో ఇద్దరు బలమైన నేతలు ఉంటే సహజంగానే ఆసక్తికర పరిణామాలు ఉంటాయి. ఆ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారని ప్రత్యర్థులకు మాత్రమే కాదు సొంత పార్టీ నేతలు కూడా ఆసక్తికరంగా చూస్తుంటారు. అటువంటి పరిస్థితి చీరాల నియోజకవర్గ వైసీపీలో ఉంది. Ysrcp : టికెట్ ఎవరికి దక్కెనో : చీరాల నియోజకవర్గ ప్రస్తుత శాసన సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు ఒకరి మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. వైసీపీ అధినాయకత్వం […]

 Authored By mallesh | The Telugu News | Updated on :18 October 2021,4:20 pm

Ysrcp : ఒకే పార్టీలో ఇద్దరు బలమైన నేతలు ఉంటే సహజంగానే ఆసక్తికర పరిణామాలు ఉంటాయి. ఆ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారని ప్రత్యర్థులకు మాత్రమే కాదు సొంత పార్టీ నేతలు కూడా ఆసక్తికరంగా చూస్తుంటారు. అటువంటి పరిస్థితి చీరాల నియోజకవర్గ వైసీపీలో ఉంది.

ycp leader ultimatum to ycp leadership

ycp leader ultimatum to ycp leadership

Ysrcp : టికెట్ ఎవరికి దక్కెనో :

చీరాల నియోజకవర్గ ప్రస్తుత శాసన సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు ఒకరి మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. వైసీపీ అధినాయకత్వం ఈ విషయమై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకుగాను ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తిని కాదని శాసస సభ్యుడు నియోజకవర్గ ప్రజలతో మమైకమై ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో టికెట్ ఆశిస్తున్న వైసీపీకి చెందిన వ్యక్తి ఒకరు పార్టీలో అన్ని తానై నడిపించాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తనంతట తానుగా సొంత కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాడు. వైసీపీ అధినాయకత్వం తనను బలపరచకపోతే తాను సొంతంగానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్తున్నాడట.

ycp leader ultimatum to ycp leadership

ycp leader ultimatum to ycp leadership

ఈ విషయమై అధిష్టానానికి కూడా తెగేసి చెప్పేశాడని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, వైసీపీ అధినాయకత్వం సదరు నేతను మరో నియోజకవర్గానికి మారాలని సూచించగా, తాను చీరాలలోనే ఉంటానని ఫైనల్ డెసిషన్ చెప్పేశాడట.ఇక ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఎవరి సత్తా వారు చాటుకునేందుకుగాను విడిపోయి మరి తమ వర్గాల వ్యక్తులకు నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇలా అధికార వైసీపీలోనే నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉండటం స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. అయితే, ఇలా విభేదాలు తారాస్థాయికి చేరితే కనుక కచ్చితంగా ప్రత్యర్థి పార్టీలకు లాభం అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో నేతలందరూ కొత్త, పాత లేకుండా ఐక్యంగా ముందుకు సాగుతూ, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినపుడే ఆ పార్టీ కొన్నాళ్ల పాటు రాజకీయ అధికారంలో ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, వైసీపీ అధిష్టానం నేతల మధ్య విభేదాలను ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి మరి..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది