YS jagan : వైఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఈ నెల నుంచే అమలు..!!
YS jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో పాలనపరంగా అనేక మార్పులు తీసుకురావడం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకే చేరుకునే రీతిలో… వ్యవస్థను పూర్తిగా మార్చేశారు. ప్రజలు నాయకులు మరియు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగనిచ్చే పరిస్థితి లేకుండా… వారి చెంతకు పాలన సీఎం జగన్ తీసుకెళ్లడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామ మరియు వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మొదటి తారీకు నాడే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు ఇంటి వద్దకే వాలంటీర్లు అందించటం.. ఇంకా ఎత్తరా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులను వాలంటీర్లు దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఎక్కడా కూడా ప్రభుత్వ పథకాలు సేవలు ప్రజలకు అందడంలో ఎక్కడ నిర్లక్ష్యం ఆలస్యం… జరగకుండా గ్రామ మరియు వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా సీఎం జగన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నిస్వార్ధంగా అమలు చేస్తూ పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించే కార్యక్రమం ఈ ఏడాది కూడా చేయడానికి పూనుకుంది. ఈ నెల 19న విజయవాడలో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించడానికి రెడీ అయింది. దాదాపు నెల రోజులపాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో.. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించటమే కాకుండా నగదు బహుమతి కూడా అందించేలా… వాలంటీర్లకు వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెల రోజులపాటు జరిపించడానికి రెడీ అయింది.
ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సేవా వజ్ర, సేవా మిత్ర అవార్డులకు ఎంపిక చేయనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు ప్రధానం ఈనెల 19న చేయనున్నారు. ఈ అవార్డుతో పాటు 30 వేల రూపాయల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ అందజేయనున్నారు. సేవా రత్న అవార్డు అందుకునే వారికి 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా సర్టిఫికెట్ లు అందజేయనున్నారు. ఇక మూడో అవార్డు విషయానికొస్తే ఏడాది పాటు సర్వీస్ పూర్తి చేసుకుని ఎలాంటి ఫిర్యాదు లేకుండా పనిచేసిన గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు సేవ మిత్ర అవార్డు అందజేయనున్నారు. ఈ అవార్డుతో పాటు పదివేల నగదు బహుమతి అందుకోబోతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ఏప్రిల్ నెలలో నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావించింది. కానీ ఆ సమయంలో కొన్ని అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. కాగా ఈనెల 19న గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రధానం చేయనున్నారు.