YS Jagan Mohan Reddy : పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన జగన్..!
ప్రధానాంశాలు:
YS Jagan Mohan Reddy : పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన జగన్..!
YS Jagan Mohan Reddy : ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు మంచి ఊపు మీదున్నాయి. జగన్‌కి గాయమైన కూడా ఆయన ప్రచారంలో దూకుడు తగ్గించడం లేదు. రోజురోజుకి జగన్ ప్రసంగంలో వాడి వేడి పెరుగుతుంది. పంచులు, ప్రాసలు, సెటైర్లతో విపక్షాలపై విరుచుకుపడుతున్న జగన్.. భీమవరంలో జరిగిన మేమంతా సిద్ధం సభలోనూ కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తన మీద కోపంతో చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని చెప్పారు జగన్. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో మోసపు హామీలు ప్రకటిస్తున్నారని వాటిని నమ్మోద్దని చెప్పారు. ఇక తనపై చంద్రబాబుకి ఉన్న కోపంతో శాపనార్థాలు పెడుతున్నారని, రాళ్లు వేయాలని రెచ్చగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Mohan Reddy : పవన్‌పై జగన్ పంచ్‌లు..
” రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి అంటూ తనదైన శైలిలో ప్రాసలతో పంచ్‌లు వేశారు జగన్.. చంద్రబాబు పేదలకు, సామాజికవర్గాలకు చేసిందేమీ లేదు. అయినా కూడా బాబు అంటే అభివృద్ధి అంటూ ఊదరగొటట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఖాళీ డబ్బాలలో రాయి వేసి ఊపినట్లు వాళ్లు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు అభివృద్ధికి సంబంధం ఏమీ లేదు. సెల్ ఫోన్ తెచ్చానని, ఐటీ అభివృద్ధి చేశానని.. సత్యనాదెళ్లను చదివించానని ఆయన చెబుతూనే ఉన్నారు. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అనుభవజ్ఞుడు అని ఆయన అధికారంలోకి తెచ్చారు.కాని చివరకు ఏమైంది చంద్రబాబు సింగపూర్ కట్టాడా. మైక్రోసాఫ్ట్ వచ్చిందా.. పోర్టులు కట్టాడా” అంటూ జగన్ విమర్శలు గుప్పించారు.
ఇక పవన్‌ని టార్గెట్ చేసిన ప్రతిసారి కూడా ఆయన పెళ్లిళ్లపై పంచ్‌లు వేసే జగన్ ఈ సారి కూడా అదే స్టైల్‌లో కామెంట్స్ చేశారు. నాలుగేళ్లకోసారి కార్లు మార్చినట్లు దత్తపుత్రుడు భార్యలను మారుస్తారంటూ విమర్శించారు.పె ళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి, పిల్లలను పుట్టించి, కార్లు మార్చేసిన విధంగా భార్యలను మార్చేసే దత్తపుత్రుడు ఇప్పుడు నియోజక వర్గం కూడా వదిలేస్తున్నారని ఆయన మీద విమర్శలు గుప్పించారు. దత్తపుత్రుడుకి సైతం బీపీ ఎక్కువైంది. ఒక్కసారి చేస్తే అది పొరపాటు అనుకోవచ్చు, కాని పదే పదే చేస్తే దానిని తప్పు అంటాం. ఆడవాళ్లను చులకనగా చూడొద్దని చెప్పటం వల్లనే పవన్ కళ్యాణ్‌కు తనపై కోపం వస్తోందంటూ విమర్శలు గుప్పించారు