Ys Jagan : బీజేపీ మీద తొలిసారి సీరియస్ అయిన జగన్..సెక్యులర్ స్లాట్ లోకి మళ్లుతున్నాడా..!
Ys Jagan : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జగన్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో భాగంగా- తిరుమలను సందర్శించాలని, శ్రీవారిని దర్శించుకోవాలనీ జగన్ నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపాన్ని దాల్చలేకపోయింది. ఈ క్రమంలో జగన్ నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూంటే ఆయనను మందలించకుండా బీజేపీ వత్తాసు పలుకుతోంది అంటూ జగన్ ఫైర్ అవుతున్నారు.
Ys Jagan జగన్‌పై గురి..
భారత దేశం సెక్యులర్ అని ఆయన అంటూ ప్రియాంబుల్ లో రాసినది మీడియాకు చదివి వినిపించడంతో దేశంలోసెక్యులరిజం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సెక్యులర్ స్లాట్ లోకి జగన్ మళ్ళుతున్నట్లుగా రాజకీయ సన్నివేశం కనిపిస్తోంది అని అంటున్నారు. జగన్ ని హిందూత్వ కార్డుతో కటడి చేయాలని చూస్తున్నారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అన్న దాని మీద సీబీఐ విచారణ చేయాలని జగన్ కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దాని మీద ఇంతవరకూ స్పందన లేదు. దేశంలో హిందూత్వ వర్సెస్ సెక్యులరిజం అన్న దాని మీద విభజన రేఖ గీసుకుని రాజకీయం సాగుతోంది. ఇపుడు ఏపీలో కూడా సెక్యులరిజం అని వైసీపీ అంటోంది.
వైసీపీని ఎలిమినేట్ చేయడానికి టీడీపీ కూటమి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా హిందూత్వాన్ని ముందుకు తెచ్చారని వైసీపీ అనుమానిస్తోంది. దాంతో హిందూత్వ విషయంలో తమ కమిట్మెంట్ ని చాటుకుంటూ వీలైనంత క్లెయిం చేసుకుంటూనే అదే సమయంలో సెక్యులరిజం అంటూ రెండవ పొలిటికల్ స్లాట్ వైపుగా వైసీపీ అడుగులు వేస్తోంది అని అంటున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని ఆయన పార్టీ క్యాడర్‌కు సూచించారు. అదే సమయంలో తాను స్వయంగా తిరుమలకు వెళ్లాలనీ, రాత్రి అక్కడే బస చేయాలనీ నిర్ణయించారు. జగన్ తిరుమలకు వెళ్తారంటూ వార్తలొచ్చిన మరుక్షణం నుంచే డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు.