Chandrababu naidu : జగన్‌.. ఏబీసీడీ పాలన చేస్తున్నాడు.. కర్నూల్ లో నిప్పులు చెరిగిన చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu naidu : జగన్‌.. ఏబీసీడీ పాలన చేస్తున్నాడు.. కర్నూల్ లో నిప్పులు చెరిగిన చంద్రబాబు

 Authored By brahma | The Telugu News | Updated on :5 March 2021,10:31 am

Chandrababu naidu : తెదేపా హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్ విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కర్నూలు కింగ్ మార్కెట్ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిన్నదని ఆలయాలపై దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు.

Chandrababu naidu ys Jagan was giving priority to destruction chandrababu

Chandrababu naidu : ys Jagan was giving priority to destruction : chandrababu

పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌.. ఏబీసీడీ పాలన తెచ్చారని దుయ్యబట్టారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన.. బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని వ్యాఖ్యానించారు. అమరావతిని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

బాబాయిని ఎవరో చంపారని ఆనాడు అన్నారు. ఈరోజు ఎవరు చంపారో అర్థం అయ్యింది. నాకు అన్యాయం జరిగిందని షర్మిల రోడ్డెక్కారు. సమైక్యాంధ్రలో నేనే ఎక్కువ కాలం పని చేశాను. చిత్తూరులో ఏకగ్రీవాలు చేశారు. తిరుపతిలోకి నాకు అనుమతి ఇవ్వలేదు. చరిత్రలో ఎన్నడూ ఇన్ని ఏకగ్రీవాలు జరగలేదు. నామినేషన్లు అన్నీ సక్రమంగా ఉన్నా రిజెక్ట్ చేశారు. 50 శాతంపైగా నెగ్గేవాళ్లం. అర్ధరాత్రి డ్రామా జరిగిందని చంద్రబాబు అన్నారు.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రచారం చేయటంతో, టీడీపీ శ్రేణుల్లో ఉత్సహం నెలకొని ఉంది. మరోపక్క యువనేత నారా లోకేష్ కూడా విశాఖ నుండి ప్రచారం మొదలుపెట్టాడు. తండ్రి రాయలసీమ నుండి కొడుకు ఉత్తరాంధ్ర నుండి ప్రచారం చేయటం విశేషం. మరోపక్క వైసీపీ మాత్రం రాష్ట్రంలో ఏకగ్రీవాల విషయంలో ముందడుగులో ఉంది. ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీ లను కైవసం చేసుకుంది. చాలా చోట్ల డివిజన్స్ వారీగా భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయి.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది