YS Sharmila : వైసీపీ, వైఎస్ఆర్‌కి సంబంధమే లేదు.. ఇంకోసారి అలా చేస్తే ఊరుకోనంటూ షర్మిళ ఆగ్రహం
YS Sharmila : గత కొద్ది రోజులుగా షర్మిళ పేరు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల 2021 జూలై 8న తన తండ్రి వైఎస్ జన్మదినం సందర్భంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీ ఏర్పాటు తర్వాత తెలంగాణలో 3400 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల ఈ మధ్యకాలంలో వచ్చిన తెలంగాణలో వచ్చిన ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆఖరుకు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల బరి నుండి తప్పుకుని కేసీఆర్ ఓటమి ధ్యేయంగా తప్పుకున్నట్లు ప్రకటించింది.
YS Sharmila జగన్‌పై షర్మిళ పైర్..
ఇటీవల రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది షర్మిళ. ఆమె వైఎస్ విగ్రహాలపై దాడులు చేయటాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె…..తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని స్పష్టం చేశారు. వైసీపీకి రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదని వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇదే తన హెచ్చరిక అన్నారు.
మరోమారు ఇలాంటి సంఘటనలు జరిగితే అక్కడే భైఠాయించి ధర్నా చేస్తానని షర్మిల చెప్పారు. ఇలాంటి హత్య, కక్ష, గుండా రాజకీయాలు వైసీపీ చేసిందనే ప్రజలు ఘోరంగా వైసీపీని ఓడించారని గుర్తు చేశారు. మళ్లీ అదే పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.ఇక రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి రోజున జగన్ ఏమి చేశారు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కూడా ఐదు నిముషాలు మాత్రమే ఉన్నారని అన్నారు. వందల కోట్లు సిద్ధం సభలకు ఖర్చుపెట్టిన మీరు వైఎస్ఆర్ జయంతికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి అని డిమాండ్ చేశారు. కనీసం ఒక సభ పెట్టి ఆయనకు నివాళి అర్పించలేకపోయారని దుయ్యబట్టారు