Acharya Movie Review : చిరంజీవి ఆచార్య మూవీ రివ్యూ, రేటింగ్..!
Acharya Movie Review : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఫుల్ లెన్త్ రోల్ లో ఏ సినిమాలో నటించలేదు. రామ్ చరణ్ మూవీ మగధీరలో కాసేపు అలా చిరంజీవి మెరిశారు అంతే. ఆ తర్వాత మరో మూవీలో కూడా జస్ట్ అతిథి పాత్రలో చిరంజీవి మెరిశారు కానీ.. పూర్తి స్థాయిలో ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది తాజాగా రిలీజ్ అయిన ఆచార్య Acharya Movie Review అనే చెప్పుకోవాలి. నిజానికి.. ఇది చిరంజీవి సినిమానే అయినా.. సిద్ధగా నటించిన రామ్ చరణ్ పాత్ర కూడా సినిమాకు కీలకం. దాదాపు 40 నిమిషాల పాటు రామ్ చరణ్ పాత్ర ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో, మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన ఈ సినిమాలో తండ్రీకొడుకులు ఇద్దరూ నటించడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి.. తెలుగు ప్రేక్షకుల అంచనాలను ఆచార్య అందుకున్నాడా? లేదా? తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
Acharya Movie Review : సినిమా పేరు : ఆచార్య
నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే తదితరులు
డైరెక్టర్ : కొరటాల శివ
ప్రొడ్యూసర్ : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
రన్ టైమ్ : 2 గంటల 34 నిమిషాలు
రిలీజ్ డేట్ : 29 ఏప్రిల్ 2022
Acharya Movie Review : కథ ఇదే
సినిమాకు ప్రధాన బలం ధర్మస్థలి. అదో గురుకులం. దానికి కాపలాదారుడు లేదా సంరక్షకుడు సిద్ధ(రామ్ చరణ్). అక్కడి స్థానిక ప్రజలకు సిద్ధ అండగా ఉంటాడు. కానీ.. రాజకీయంగా ఎదగాలనుకున్న బసవ(సోనూసూద్) కన్ను ధర్మస్థలిపై పడుతుంది. దాన్ని దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ.. ధర్మస్థలిని కాపాడుతున్న సిద్ధను అడ్డు తప్పిస్తేనే.. తనకు ధర్మస్థలి చిక్కుతుందని అనుకుంటాడు బసవ. కానీ.. సిద్ధ ధర్మస్థలిని వదిలేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అసలు సమస్య ప్రారంభం అవుతుంది. అప్పుడే ఆచార్య(చిరంజీవి) ధర్మస్థలిలో అడుగుపెడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ధర్మస్థలిలో ఉన్న సిద్ధవనానికి ఆచార్యకు సంబంధం ఏంటి. సిద్ధ ఎవరు? ఆచార్య ఎవరు? సిద్ధ వెళ్లిపోగానే.. ఆచార్య ఎందుకు వచ్చాడు? ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆచార్య.. ధర్మస్థలిని బసవ నుంచి కాపాడుతాడా? అనేదే మిగితా కథ.
Acharya Movie Review విశ్లేషణ
ఇక.. సినిమా విశ్లేషణ గురించి చర్చించాల్సి వస్తే.. సినిమా మొత్తం ధర్మస్థలి మీదనే తిరుగుతుంది. అదే మెయిన్ పాయింట్. దాన్ని పట్టుకొని డైరెక్టర్ కథను లాగడానికి ప్రయత్నించాడు. చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా మలిచాడు. ప్రేక్షకుల కోసమే.. ఇద్దరి మధ్య సీన్స్ ను పెంచడంతో పాటు.. రామ్ చరణ్ రోల్ ను కూడా పెంచాడు.
అయితే.. అక్కడే కొరటాల కాస్త పట్టు కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే.. రామ్ చరణ్ రోల్ ను కావాలని పెంచడంతో ఆ రోల్ ను సాగదీసినట్టుగా ప్రేక్షకుడికి అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకు బలం ఆయనే. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం. సిద్ధ రోల్ లో రామ్ చరణ్ కూడా అద్భుతంగా నటించాడు.
- Also Read
An exciting update about Mahesh Babu Sarkaru Vaari Paata
Mega Power Star Ram Charan Confirms Movie With Uncle Pawan Kalyan!
Acharya Movie Review ప్లస్ పాయింట్స్
సినిమాకు బలం భలే భలే బంజారా పాట
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్
ఆర్ట్ వర్క్
ధర్మస్థలి సన్నివేశాలు
Acharya Movie Review మైనస్ పాయింట్స్
డైరెక్షన్
స్క్రీన్ ప్లే
పట్టులేని కథ
అవుట్ డేట్ అయిన కథ
మిస్ అయిన ఎంటర్ టైన్ మెంట్
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ఆచార్య సినిమా అనేది ఒక సీరియస్ డ్రామా కానీ… స్టోరీలైన్ చాలా వీక్ గా ఉంది. అలాగే.. 90వ దశకంలా సినిమాను దర్శకుడు ప్రజెంట్ చేశాడు. సినిమా కోసం చిరంజీవి, రామ్ చరణ్ చాలా కష్టపడ్డారు కానీ.. వాళ్ల కష్టానికి ఫలితం దక్కలేదు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.5/5