Dhruva Natchathiram Movie Review : చియాన్ విక్రమ్ ధృవ నక్షత్రం మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhruva Natchathiram Movie Review : చియాన్ విక్రమ్ ధృవ నక్షత్రం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

 Authored By gatla | The Telugu News | Updated on :24 November 2023,5:00 am

ప్రధానాంశాలు:

  •  ధృవ నక్షత్రం మూవీ రివ్యూ

  •  చియాన్ విక్రమ్ ధృవ నక్షత్రం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  •  Dhruva natchathiram movie review and rating in telugu

Cast & Crew

  • Hero : చియాన్ విక్రమ్
  • Heroine : రీతూ వర్మ
  • Cast : ఆర్. పార్తీబన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్, దివ్య దర్శిని, మున్నా సైమన్, వంశీ కృష్ణ, సలీమ్ బేగ్, సతీష్ కృష్ణన్, మాయ ఎస్ కృష్ణన్
  • Director : గౌతమ్ వాసుదేవ్ మీనన్
  • Producer : ప్రీతి శ్రీవిజయన్
  • Music : హరీస్ జయరాజ్
  • Cinematography : మనోజ్ పరమహంస

Dhruva Natchathiram Movie Review : ధృవ నక్షత్రం మూవీ రివ్యూ చియాన్ విక్రమ్ Chiyaan Vikram గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక అపరిచితుడు, ఒక మల్లన్న, ఒక శివపుత్రుడు.. ఇలా ఏ సినిమా తీసుకున్నా చియాన్ విక్రమ్ Chiyaan Vikram రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన హీరోగా నటించిన ఏ సినిమా తీసుకున్నా చాలా కొత్తగా ఉంటాయి. ఆయన ఎంచుకునే కథ కూడా కొత్తగా ఉంటుంది. అందుకే ఆయనకు విలక్షణ నటుడు అనే పేరు వచ్చింది. తమిళంలో విక్రమ్ కు ఎంత క్రేజ్ ఉందో.. అంతే క్రేజ్ తెలుగులోనూ ఉంది. ఇక్కడ కూడా ఆయనది స్టార్ హీరో రేంజ్. అందుకే తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది. విక్రమ్ సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతాయి. ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ధృవ నక్షత్రం. ఈ సినిమా మొదటి భాగాన్ని యుద్ధ కాండం పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది.

ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్. రీతూ వర్మ హీరోయిన్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్ అంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అందులోనూ విక్రమ్, గౌతమ్ కాంబో అంటే ఇక మామూలుగా ఉండదు. ఈ సినిమాలో పార్తీబన్, రాధిక శరత్ కుమార్ Radhika Sarathkumar, సిమ్రాన్ Simran , వినాయకన్, దివ్య దర్శిని, మున్నా సైమన్, వంశీ కృష్ణ, సలీమ్ బేగ్, సతీష్ కృష్ణన్, మాయ ఎస్ కృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఆంటోనీ ఎడిటర్ గా వ్యవహరించగా, యాక్షన్ యానిక్ బెన్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, సహ నిర్మాతగా ప్రీతి శ్రీవిజయన్ వ్యవహరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Dhruva Natchathiram Movie Review : కథ

ముంబైని తీవ్రవాదులు టార్గెట్ చేసుకుంటారు. నగరంపై దాడి చేస్తారు. తీవ్రవాదులను మట్టుపెట్టేందుకు ఎన్ఎస్జీ బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. ఆ టీమ్ లో ఉన్న ఓ ఉన్నతాధికారి ఈ వృత్తిలో ఎలాంటి చాలెంజెస్ ఉంటాయో తన టీమ్ కి చెబుతుంటాడు. అయితే.. మన చట్టంలోని కొన్న రూల్స్.. టెర్రరిస్టులను నేరుగా ఎదుర్కునే అవకాశం లేకుండా చేస్తున్నాయని చెబుతాడు. అందుకే అసలు ఎవ్వరితో సంబంధం లేని ఒక టీమ్ ను రెడీ చేశానని ఆ టీమ్ పేరు కోవర్ట్ టీమ్ అని చెబుతాడు. అందులో 11 మంది ఉంటారు. ఆ 11 మంది టీమ్ కు స్పెషల్ ఆఫీసర్ గా విక్రమ్ ఉంటాడు. విక్రమ్ పేరు జాన్. ముంబైని టార్గెట్ చేసిన తీవ్రవాదులను జాన్ ఎలా తుదిముట్టించాడు? వాళ్లపై ఎలా పోరాటం చేస్తాడు.. అనేదే ఈ సినిమా కథ.

Dhruva Natchathiram Movie Review : విశ్లేషణ

నిజానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా ఏళ్లు అవుతోంది. 2017లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. చివరకు ఈ సినిమాను 2023 లో నవంబర్ 24న రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధమైపోయింది. ఈ సినిమాలో టెర్రరిస్టులను ఎదుర్కునే పాత్రలో చియాన్ విక్రమ్ అద్భుతంగా నటించాడు. విక్రమ్ ఈ సినిమాలో చాలా కూల్ గా ఉన్నాడు. ఈ సినిమాలో విజువల్స్ కూడా అదుర్స్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక గూఢచారి యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పూర్తి రివ్యూ కావాలంటే సినిమా విడుదలయ్యేదాకా ఆగాల్సిందే. సినిమా పూర్తిస్థాయి రివ్యూ కోసం దితెలుగున్యూస్ thetelugunews.com వెబ్ సైట్ ను ఫాలో అవుతూ ఉండండి.

Rating :

2.5/5

Also read

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది