God Father Movie Review : చిరంజీవి గాడ్ ఫాదర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది !
God Father: ఆచార్య తర్వాత చిరంజీవి నుండి వస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పెడప్పుడు సినిమా విడుదల అవుతుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తుండగా, ఆ తరుణం రానే వచ్చింది. రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఆచార్య పీడకలలు అన్ని అందరు మరచిపోవాలంటే చిరంజీవికి ఒక సాలిడ్ హిట్ కావాలి. అది గాడ్ ఫాదర్ తో నెరవేరుతుందని చిరంజీవి గట్టిగా నమ్ముతున్నాడు. అంత నమ్మకం ఉంది కాబట్టే నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నాడు. తెలుగు, హిందీ వెర్షన్ కి బాగా ప్రచారం కల్పిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఫిలిం క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు గాడ్ ఫాదర్ చిత్రం ప్లాప్ అని తేల్చేశారు. మూవీలో మేటర్ లేదంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి సినిమాలు మానేయడం మంచిదని దారుణమైన కామెంట్స్ చేశాడు. ఉమర్ సంధు కేవలం 2.5 రేటింగ్ ఇచ్చాడు. యావరేజ్ సినిమా. బి,సి క్లాస్ మాస్ సినిమా వారికి కూడా ఇలాగే అనిపిస్తుంది. చిరంజీవి సినిమాలు మానేసి విశ్రాంతి తీసుకోవడం మంచిది అన్నారు.

God Father Movie First Review out
God Father Movie Review : తప్పుడు రివ్యూ..
సాధారణంగా ఫ్లాప్ సినిమాలకు హిట్ అంటూ రివ్యూ ఇచ్చే ఇతను దీనికి ఫ్లాప్ అని ఇచ్చాడంటే ఇది హిట్ అవుతుందని అందరు భావిస్తున్నారు. గతంలో ఉమర్ సంధు స్టార్ హీరోల చిత్రాలకు బ్లాక్ బస్టర్ రేటింగ్ ఇచ్చేవాడు. ఆయన అద్బుతమన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆయన రేటింగ్స్ నమ్మడం మానేశారు. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ రేటింగ్ విషయంలో కూడా ఆయన విమర్శల పాలయ్యారు. మణిరత్నం భార్య నటి సుహాసిని ఉమర్ సంధు పై ఫైర్ అయ్యారు. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన తాజా రేటింగ్ ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.