Mufasa The Lion King Movie Review : ముఫాసా మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Mufasa The Lion King Movie Review : ముఫాసా మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Mufasa The Lion King Movie Review : 2019 లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. వాల్ట్ డిస్నీ నుండి వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ అద్భుతమైన సినిమాగా ఇది ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సినిమా ఇండియాలో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ సూపర్ హిట్ అవడంతో ఆ సినిమాకు ప్రీక్వల్ గా ముఫాసా ది లయన్ కింగ్ అనే సినిమాను ప్రకటించారు. ది లయన్ కింగ్ సినిమాలో ముఫాసా కథ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా సింబా కథ అందులో చూపించడం జరిగింది. అందుకే దానికి ఫ్రీక్వల్ గా ముపాస కథతో వస్తున్నారు మేకర్స్. ఈ ముపాస కదా ఎక్కడ మొదలవుతుంది ముపాస రాజు ఎలా అయ్యాడు ముపాసాకు టాకా ఎలా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ముపాస ఎలా రాజు అయ్యాడు ఇదే కథతో ముపాస దీ లయన్ కింగ్ స్టోరీ ఉండబోతుందని చెప్పొచ్చు. ది లయన్ కింగ్ కి ఇది ఫ్రీక్వల్ కథ కాబట్టి ఆడియన్స్ దీనిమీద కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం చిన్నపిల్లలు ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు…
Mufasa The Lion King Movie Review పిల్లలకు బాగా నచ్చేసింది..
ది లయన్ కింగ్ సినిమా హిట్ అవ్వటంలో ఎక్కువ చిన్నపిల్లల కు అది నచ్చటమే. వారి టార్గెట్ తో తీయకపోయినా ఇది పిల్లలకు బాగా నచ్చేసింది. ఇప్పుడు రాబోతున్న ముపాస కూడా వాళ్ల టార్గెట్ తోనే వస్తుందని చెప్పొచ్చు. ముపాసా ది ది లయన్ కింగ్ సినిమాకు తెలుగు వర్షన్ మరింత స్పెషల్ గా ఉండనుంది ఎందుకంటే ఈ సినిమాకు ముఫాసాకు డబ్బింగ్ చెప్పేది మన సూపర్ స్టార్ మహేష్ కావడమే. మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అని తెలియగానే ముఫాసా మీద ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి.
ముపాస చిన్నతనం నుండి టాటా పరిచయం వాళ్ళిద్దరూ కలిసి పెరిగిన తీరు ఆ తర్వాత టాకా అవ్వాల్సిన మహారాజు సింహాసనం ఉపవాస ఎలా దక్కించుకున్నాడు అన్నదే ముపాస ది లయన్ కింగ్ స్టోరీ. తెలుగు తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యేందుకు ఈ సినిమాలోని ముఖ్య పాత్రలు పోషించిన వారికి మహేష్ తో పాటు యువ హీరో సత్యదేవ్ బ్రహ్మానందం అలీ లాంటి వారంతా డబ్బింగ్ చెప్పడం విశేషం. అందుకే ముపాస సినిమాకు తెలుగులో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. రిలీజ్ రోజు బెనిఫిట్ షో కూడా ఇస్తున్నారు అంటే ఈ సినిమాను మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
నటినటులు : అన్ని యానిమేషన్ బొమ్మలే
వాయిస్ ఓవర్ (తెలుగులో ) : మహేష్, సత్యదేవ్, బ్రహ్మనందం, అలీ
సినిమాటోగ్రాఫర్ : జేమ్స్ లాక్టన్
మ్యూజిక్ : హన్స్ జిమ్మెర్, ఫారెల్ విలియమ్స్, లిన్-మాన్యుయెల్ మిరాండా, నికోలస్ బ్రిటెల్, మార్క్ మాన్సినా
స్క్రీన్ ప్లే : జెఫ్ నాథన్సన్
దర్శకుడు : బారీ జెంకిన్స్
నిర్మాణం : వాల్ట్ డిస్నీ పిక్చర్స్, పాస్టెల్ ప్రొడక్షన్స్
Mufasa The Lion King Movie Review కథ
ది లయన్ కింగ్ సినిమా సింబ కథతో మొదలవుతుంది. ఐతే ముఫాసా అంటే సింబ తండ్రి కథ. సో ముఫాసా కథ మాత్రం అతని చిన్న తనం నుంచి మొదలవుతుంది. ముఫాసా ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చాడు..? ముఫాసా తల్లిదండ్రులు ఎవరు.. వారికి ఎందుకు దూరమయ్యాడు.. అనాథగా ఉన్న ముఫాసా వేరే తెగ సిం హాలతో ఎలా చేరాడు. ఫైనల్ గా ఒక రాజుగా ఎలా ఎదిగాడు.. ముఫాసాకి కీరోస్ కు శతృత్వం ఏంటి..? ముఫాసాకి టాకా ఎలా సాయం చేశడు..? రఫీకి వీళ్లని ఎలా కలిపాడు లాంటి అన్ని ప్రశ్నలకు ముఫాసాలో సమాధానం దొరుకుతుంది.
Mufasa The Lion King Movie Review విశ్లేషణ
ది లయన్ కింగ్ సూపర్ హిట్ అయినా కూడా ముఫాసాకు తెలుగులో ఈ క్రేజ్ కి కారణం సూపర్ స్టార్ మహేష్ ముఫాసాకి డబ్బింగ్ చెప్పడమే. మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతుంది. ఆ సినిమ ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పడం కష్టం. 2028 కి వచ్చినా సంతోషమే. ఈలోగా మహేష్ ని మిస్ అవుతామా అనుకున్న వారికి ముఫాసా సర్ ప్రైజ్ చేస్తుంది. మహేష్ అద్భుతమైన లైవ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. యానిమేషన్ కథలకు మన స్టార్స్ వాయిస్ ఇస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. అందుకే ముఫాసా సినిమాను మన వాళ్లు చాలా త్వరగా ఓన్ చేసుకున్నారు.
ముఫాసా తెర మీద ఒక అద్బుతాన్ని చూపించారు. యానిమేటెడ్ పాత్రలే అయినా ఎక్కడ కూడా ఆడియన్స్ కు డౌట్ రాకుండా చాలా సహజంగా అనిపించేలా చేశారు. ఈ సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టులే చాలా కీలకం. మిగతా భాషల్లో ఏమో కానీ తెలుగు వెర్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది.
ముఫాసా పాత్ర ఎమోషన్, గాంభీర్యం.. ఇంకా చాలా వాయిస్ మాడ్యులేషన్ ని మహేష్ పర్ఫెక్ట్ సింక్ చేశాడు. జస్ట్ కళ్లు మూసుకుని వింటే అక్కడ తెర మీద మహేష్ కనిపిస్తాడని అనిపిస్తుంది. ముఫాసా కోసం మహేష్ గుంటూరు కారం యాసని వాడినట్టు అనిపిస్తుంది.
సినిమాలో మిగత పాత్రలు అన్ని కూడా అలరించాయి. ది లయన్ కింగ్ ఎలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అలరిసుతందో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది. మహేష్ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్ తో ముఫాసా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
నటన & సాంకేతిక వర్గం :
తెర మీద కనిపించే కదిలే బొమ్మల వెనక టెక్నికల్ టీం ఎఫర్ట్ కనిపిస్తుంది. ఐతే ముఫాసాలో నటన అంటే అది యానిమేషన్ చేసిన వారికే కాదు వాటికి తగినట్టుగా వాయిస్ ఇచ్చిన వారికి వస్తుంది. పర్ఫెక్ట్ సింక్ తో దేనికదే ప్రత్యేకం అనిపించేలా వాయిస్ ఓవర్ ఎంపిక జరిగింది. దాని వల్ల ముఫాసా మరింత ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవె అనిపిస్తుంది. అండర్ వాటర్ సీక్వెన్స్ లు అదిరిపోయాయి. స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసింది. డైరెక్షన్ లొ మరోసారి అదరగొట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
మహేష్ వాయిస్ ఓవర్
స్క్రీన్ ప్లే
విజువల్ వండర్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ స్లో అవ్వడం
బాటం లైన్ :
ముఫాసా.. సింహ గర్జన అదిరింది..!..
రేటింగ్ : 3/5