Mukhachitram Movie Review : విశ్వక్ సేన్ నటించిన ముఖచిత్రం మూవీ రివ్యూ అండ్ రేటింగ్…!
Mukhachitram Movie Review : విశ్వక్సేన్ అతిథి పాత్రలో నటించిన ముఖ చిత్రం అనే సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమాకు కలర్ ఫోటో సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రాజ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. అలాగే ఈ సినిమాను ఆయనే నిర్మించాడు. ఈ సినిమాకు గంగాధర్ దర్శకత్వం వహించగా.. వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్ ముఖ్య పాత్రల్లో నటించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే. ఈ సినిమాలో వికాశ్ వశిష్ట.. ప్లాస్టిక్ సర్జన్ గా నటించాడు. అయితే.. మొదటి సారి మహతి(ప్రియ వడ్లమాని)ని చూసి ఇష్టపడతాడు.తన ఫోటో చూసే ఇష్టపడి ప్రేమిస్తాడు. ఆ తర్వాత తననే పెళ్లి చేసుకుంటాడు.
కానీ.. చిన్నప్పటి నుంచి రాజ్ ను ప్రేమిస్తున్న మాయ(అయేషా ఖాన్ )కు ఇది నచ్చదు. అదే సమయంలో మాయకు యాక్సిడెంట్ అవుతుంది. ఫేస్ మొత్తం చెడిపోతుంది. అదే సమయంలో రాజ్ భార్య మహతి కింద పడి చనిపోతుంది. వృత్తి రిత్యా ప్లాస్టిక్ సర్జన్ అయిన రాజ్.. తన భార్య మృతిని తట్టుకోలేక… మహతి ముఖాన్ని మాయకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. ఆ తర్వాత సినిమా కథ చాలా టర్న్స్ తిరుగుతుంది. ఆ తర్వాత ఏమౌతుంది. మాయ ఏం చేస్తుంది? ఇద్దరూ కోర్టుకు ఎందుకు వెళ్తారు? అక్కడ విశ్వక్సేన్ క్యారెక్టర్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెర మీదే చూడాలి. సినిమా పేరు : ముఖచిత్రం, నటీనటులు : విశ్వక్సేన్, వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యరావ్, తదితరులు, ప్రొడ్యూసర్ : సందీప్ రాజ్, డైరెక్టర్ : గంగాధర్, మ్యూజిక్ డైరెక్టర్ : కాళ బైరవ, విడుదల తేదీ : 9 డిసెంబర్ 2022
Mukhachitram Review : సినిమా ఎలా ఉందంటే?
ఈ సినిమాలో ఇద్దరు లేడీ క్యారెక్టర్లు చాలా ముఖ్యమైనవి. మహతి పాత్రలో నటించిన ప్రియ వడ్లమాని.. ఆ తర్వాత మాయ క్యారెక్టర్ లో కనిపించిన ప్రియ. రెండు పాత్రల్లో నటించి అదరగొట్టేసింది. ఫస్ట్ హాప్ లో మహతిగా… సెకండ్ హాఫ్ లో మాయగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్లాస్టిక్ సర్జన్ గా నటించిన వికాశ్ విశిష్ట కూడా మెప్పించాడు. ఈ సినిమాలో విశ్వక్సేన్ తో పాటు సునీల్ కూడా గెస్ట్ రోల్ లో నటించాడు. సినిమాలోని అందరు నటులు అద్భుతంగా నటించారు.
అలాగే.. సినిమాలో ట్విస్టులు ఎక్కువగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సూపర్బ్. కాకపోతే.. ఫస్ట్ హాప్ మాత్రం కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. అయితే.. సినిమాలో ఉండే ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో విశ్వక్సేన్ లాయర్ పాత్రలో నటించాడు. ఇది ఒక డిఫరెంట్ ఫ్యామిలీ త్రిల్లర్ గా తెరకెక్కింది. చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ఈ సినిమాను త్రిల్లర్ గా, ట్విస్ట్ ల కోసం చూడొచ్చు. కథ కొత్తగా ఉన్నా కథలో కొత్తదనం లేదు. కేవలం ట్విస్టుల కోసమే సినిమాలో రొటీన్ కథను ట్విస్టులుగా చూపించినట్టుగా ఉంటుంది.
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.5/5