Extra Ordinary Man Movie Review : నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Extra Ordinary Man Movie Review : నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Cast & Crew
- Hero : నితిన్
- Heroine : శ్రీలీల
- Cast : రాజశేఖర్, రావు రమేష్, సంపత్, బ్రహ్మాజీ, పవిత్ర లోకేష్, హరి తేజ, జగదీష్, హైపర్ ఆది, సుదేవ్ నాయర్, రోహిణి, హర్ష వర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్,
- Director : వక్కంతం వంశీ
- Producer : ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి
- Music : హారిస్ జయరాజ్
- Cinematography : ఆర్థర్ ఎ. విల్సన్, జె.యువరాజ్, సాయి శ్రీరామ్
Extra Ordinary Man Movie Review : ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రివ్యూ ఎక్స్‌ట్రా ఆర్డినరీ అంటే అర్థం సాధారణం కాదు అన్నమాట. అంటే అసాధారణ వ్యక్తి అని మనం అచ్చ తెలుగులో చెప్పుకోవచ్చు. అంటే నితిన్ తాజాగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీకి ఆ పేరు పెట్టడానికి కారణం.. ఈ సినిమాలో నితిన్ మామూలు వ్యక్తి కాదు.. అసాధారణ వ్యక్తి అని అర్థం వచ్చేలా ఈ సినిమాకు ఆ పేరు పెట్టి ఉండొచ్చు. సాధారణంగా నితిన్ ఎంచుకునే స్టోరీలు చాలా కొత్తగా, రొటీన్ స్టోరీలకు భిన్నంగా ఉంటాయి. అయితే.. ఈ మూవీ కూడా రొటీన్ స్టోరీకి భిన్నంగా ఉంటుంది అని చెప్పేందుకు ఈ మూవీ టీజర్, ట్రైలరే ఒక ఉదాహరణ. ఎందుకంటే.. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే మామూలుగా ఉండదు. ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైనర్ గా అనిపిస్తుంది ఈ మూవీ ట్రైలర్. ఈ సినిమాకు వక్కంతం వంశీ డైరెక్టర్. ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైనర్ కంటే కూడా రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక.. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో రావు రమేశ్, పవిత్ర లోకేష్, హరితేజ, హైపర్ ఆది, సంపత్, బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రవీణ్ పూడి ఎడిటర్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్, విల్సన్, యువరాజ్.
ముఖ్యంగా ఈ సినిమా కంటే ముందు ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఒకరు ఈ సినిమా డైరెక్టర్, మరొకరు ఈ సినిమా హీరో. హీరో నితిన్ కు అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి కానీ.. నితిన్ రేంజ్ కు తగ్గట్టుగా ఏ సినిమా కూడా ఆడలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు నితిన్. ఈనెల 8న అంటే రేపే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీకి దర్శకత్వం వహించిన వక్కంతం వంశీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన రేసు గుర్రం, కిక్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి సినిమాలకు కథ రాశాడు. ఇప్పుడు స్వయంగా కథ రాసుకొని తనే దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి హీరో రాజశేఖర్. అసలు రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో నటించరు. కానీ.. ఈ సినిమాలో మాత్రం ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారనే అనుకోవాలి.
Extra Ordinary Man Movie Review : వరుస డిజాస్టర్ల నుంచి నితిన్ బయటపడతాడా?
నితిన్ ఈ మధ్య నటించిన బీష్మ తప్పితే రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. అందుకే.. చాలా గ్యాప్ తీసుకొని మరీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ మన ముందుకు వచ్చేశాడు. అయితే.. ఈ సారి నితిన్ కామెడీ ప్లస్ ఎంటర్ టైనర్ నే నమ్ముకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ హాప్ అయితే కామెడీ సీన్లతో నిండిపోతుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకొని తీరాల్సిందే. సెకండ్ హాఫ్ లో కథ ఒక్కసారిగా ట్విస్టులతో యూటర్న్ తీసుకుంటుంది. అలాగే.. ఇంటెర్వల్ బ్యాంగ్, క్లైమాక్స్ అదుర్స్ అనే చెప్పుకోవాలి. ఇక.. రాజశేఖర్ పాత్ర ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా మరో లేవల్ కు వెళ్లింది.
ఇక.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. నైజాం రైట్స్ తీసుకుంటే రూ.7.50 కోట్లు అయినట్టు తెలుస్తోంది. సీడెడ్ రైట్స్ రూ.3 కోట్లు. ఆంధ్రాలో రూ.9 కోట్లు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక.. ఓవర్సీస్ విషయానికి వస్తే రూ.3 కోట్లు, ఇక ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లు బిజినెస్ జరిగింది. అంతా కలిసి అటూ ఇటుగా రూ.25 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. దాని కంటే ఒక కోటి ఎక్కువ వస్తే బ్రేక్ ఈవెన్ కు మూవీ చేరుకున్నట్టే.