Mangalavaaram Movie Review : పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mangalavaaram Movie Review : పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

 Authored By gatla | The Telugu News | Updated on :17 November 2023,7:42 am

ప్రధానాంశాలు:

  •  పాయల్ రాజ్ పుత్ నటన మరోసారి ప్రేక్షకులను మెప్పించిందా?

  •  అజయ్ భూపతి మరోసారి హిట్ కొట్టినట్టేనా?

  •  అసలు ఈ సినిమా కథ ఏంటి.. మంగళవారం అనే పేరు ఎందుకు పెట్టారు?

Cast & Crew

  • Hero : అజ్మల్ అమీర్, శ్రీతేజ్, చైతన్య కృష్ణ
  • Heroine : పాయల్ రాజ్ పుత్
  • Cast : నందిత శ్వేత, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు
  • Director : అజయ్ భూపతి
  • Producer : స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం
  • Music : అజనీష్ లోక్ నాథ్
  • Cinematography : దాశరథి శివేంద్ర

Mangalavaaram Movie Review : మంగళవారం అనే వారం పేరునే సినిమా పేరుగా పెట్టడమే కొత్త. పేరులోనే ఇంత కొత్తదనం ఉందంటే.. ఇక సినిమాలో ఇంకెంత కొత్తదనం ఉండాలి. సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అనే చెప్పుకోవాలి. ఒక ఆర్ఎక్స్ 100, ఒక మహాసముద్రం.. ఈ రెండు సినిమాలు చూస్తేనే తెలుస్తుంది డైరెక్టర్ అజయ్ భూపతి పనితనం ఏంటో. ఆర్ఎక్స్ 100 మూవీ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన మహా సముద్రం సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసినా ఆ సినిమా కథ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక.. అజయ్ భూపతి నుంచి వచ్చిన మూడో మూవీ మంగళవారం. అయితే.. ఈ సినిమా పేరు వెనుక, మంగళవారం రోజు జరిగే ఘటనలను కథగా అల్లుకొని డైరెక్టర్ ఈ సినిమా తీశాడు. ఒకరకంగా చూస్తే ఈ సినిమా కథ.. వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా, మెయిల్ లీడ్ రోల్ లో నటించిన పాయల్ రాజ్ పుత్ రెచ్చిపోయి మరీ నటించింది. మరో లీడ్ రోల్ లో పోలీస్ ఆఫీసర్ గా నందిత శ్వేత నటించింది.

అజ్మల్ అమీర్, శ్రీతేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అజయ్ భూపతి కాగా, స్వాతిరెడ్డి గునుపాటి, సురేశ్ వర్మ ఎం నిర్మాతలుగా వ్యవహరించారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ కాగా, అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటర్, తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్ మాటలు రాయగా, మోహన్ తాళ్లూరి ఆర్ట్ డైరెక్టర్, రఘు కులకర్ణి ప్రొడక్షన్ డిజైనర్, రియల్ సతీష్, పృథ్వీ ఫైట్ మాస్టర్స్, సౌండ్ డిజైనర్ అండ్ ఆడియో గ్రఫీ రాజా కృష్ణన్, భాను కోరియోగ్రఫీ, ముదాసర్ మొహ్మద్ కాస్ట్యూమ్ డిజైనర్, ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా 17 నవంబర్ 2023, శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి.. ఈ సినిమా కథ ఏంటి.. ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఆర్ఎక్స్ 100 రేంజ్ లో ఉందా? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.

Mangalavaaram Movie Review : సినిమా కథ

ఈ కథ మహా లక్ష్మీపురం అనే గ్రామంలో ప్రారంభం అవుతుంది. ఆ గ్రామంలో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లలో ఒక్కో జంట ప్రతి మంగళవారం చనిపోతూ ఉంటుంది. మంగళవారం రాగానే ఏదో ఒక జంట మరణిస్తూ ఉంటారు. వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు, ఎలా మరణిస్తున్నారు.. అనే విషయం తెలియక ఆ ఊరి ప్రజలు మాత్రం తీవ్రంగా భయపడుతూ ఉంటారు. అందులోనూ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లే మరణిస్తూ ఉండటంతో ఈ మిస్టరీ ఏంటనేది ఎవ్వరికీ అర్థం కాదు. అయితే.. గ్రామంలో అమ్మవారి జాతర నిర్వహించకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోందని తర్వాత గ్రామస్తులు భావిస్తారు. మరోవైపు ఒక మహిళా దెయ్యం వచ్చి ఇలా ప్రతి మంగళవారం ఒక్కో జంటను చంపేస్తోందని అనుకుంటారు. అప్పుడే ఆ గ్రామంలో జరిగే మర్డర్ల మిస్టరీని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ నందిత శ్వేత ఆ ఊరిలో అడుగుపెడుతుంది. అదే గ్రామానికి చెందిన శైలు(పాయల్ రాజ్ పుత్) ఎవరు? తనే ఈ హత్యలు చేసిందా? అవి నిజంగా హత్యలా? అసలు శైలును ఎందుకు గ్రామస్తులు శిక్షించాలని అనుకుంటారు. ప్రతి మంగళవారమే మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి. ఆ మరణాల మిస్టరీని ఎస్ఐ ఛేదిస్తుందా? అనే విషయం తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

Mangalavaaram Movie Review : విశ్లేషణ

నిజానికి.. ఈ సినిమా కథకు, శైలు అనే అమ్మాయికి కనెక్షన్ ఉంటుంది. అసలు ఈ సినిమాకు ఒక హీరో ఉండడు.. ఒక హీరోయిన్ ఉండదు. కానీ.. సినిమా చూస్తున్నంత సేపు ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ లేదు అనే భావన ప్రేక్షకులకు అస్సలు కలగదు. ఫస్టాఫ్ మొత్తం చాలా ట్విస్టులు.. ఆ ట్విస్టులను సెకండాఫ్ లో రివీల్ చేస్తూ అద్భుతంగా కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో మెయిల్ లీడ్ లో నటించిన పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను అద్భుతంగా నటించిందనే చెప్పుకోవాలి. ఇది ఒక రస్టిక్ డ్రామా అని చెప్పుకోవాలి. ఎస్ఐగా నటించిన నందిత శ్వేత కూడా అదరగొట్టేసింది. ఈ సినిమాలో నటించిన ప్రతి క్యారెక్టర్ కు ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఇది పాతకాలంలో జరిగిన కథ కావడంలో అప్పటి నేపథ్యంలోనే సినిమాను సాగిస్తారు. జమిందార్ గా చైతన్య, మిగితా పాత్రల్లో నటించిన రవీంద్ర విజయ్, అజ్మల్ అదరగొట్టేశారు.

ప్లస్ పాయింట్స్

కెమెరా విజువల్స్

మ్యూజిక్(బీజీఎం)

క్లైమాక్స్ ట్విస్ట్

సినిమాటోగ్రఫీ

కామెడీ

మైనస్ పాయింట్స్

స్క్రిప్ట్ లో లోపాలు

లాజిక్ కు దూరంగా కొన్ని సన్నివేశాలు

Rating :

3/5

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది