pelli sandad Movie Review : పెళ్లి సందD మూవీ రివ్యూ
పెళ్లి సందడి అనగానే గుర్తొచ్చేది రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1996లో రిలీజ్ అయిన శ్రీకాంత్ మూవీ. ఆ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా.. శ్రీలీల హీరోయిన్ గా పెళ్లి సందD అనే సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను గౌరీ రోనంకి తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. మరి.. 1996 లో వచ్చిన పెళ్లి సందడి.. 2021 పెళ్లి సందD కి తేడా ఏంటి? ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ
ఈ సినిమాలో మన హీరో రోషన్ పేరు వశిష్ట. తన మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకునేందుకు ట్రై చేస్తుంటాడు. అందుకే తన మనసుకు నచ్చే అమ్మాయి కోసం వెతుకుతుంటాడు వశిష్ట. అయితే.. తన సోదరుడి పెళ్లిలో అనుకోకుండా సహస్రను చూస్తాడు. సహస్ర ఎవరో కాదు మన హీరోయిన్ శ్రీలీల. వెంటనే ప్రేమో పడతాడు. సహస్ర కూడా వశిష్టను చూసి ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇంతలో వాళ్ల ప్రేమకు కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులను హీరో ఎలా ఎదుర్కొంటాడు. తన ప్రేమను ఎలా సాధిస్తాడు.. అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్
ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ రోషన్. తన నటనతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. రోషన్ డైలాగ్ డెలివరీ కూడా సూపర్బ్. తన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నాడు రోషన్. ఇక.. హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. గ్లామర్ తో ఆకట్టుకుంది. రఘుబాబు, రావు రమేశ్ కామెడీ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది.
మైనస్ పాయింట్స్
కథనంలో బలం లేదు. సెకండ్ హాఫ్ లో డ్రామా సన్నివేశాలు తేలిపోయాయి. హీరోయిన్ కి నటించే చాన్స్ ఉన్నా స్కోప్ రాలేదు. కథ చాలావరకు బోరింగ్ గా ఉంది. సరైన కథను ఎంచుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్ అయ్యాయి. సంగీతం కూడా ఏదో పాత కాలం నాటి దానిలా ఉంది. ప్రొడక్షన్ గానూ ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది.
కన్ క్లూజన్
మొత్తం మీద చెప్పాలంటే.. 1996 లో వచ్చిన ఆ పెళ్లి సందడికి.. ఈ పెళ్లి సందDకి అస్సలు సంబంధమే లేదు. పేరుకు రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా విడుదలైనా.. ఈ సినిమా ఆ జానర్ లో ఎంటర్ టైన్ మెంట్ మాత్రం చేయలేదు. దసరా రోజు ఏదో సరదాకు ఫ్యామిలీతో వెళ్లి సినిమాను ఎంజయ్ చేయాలనుకుంటే మాత్రం నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.