Radhe Shyam Movie Review : రాధే శ్యామ్ మూవీ ఫస్ట్ రివ్యూ
Radhe Shyam Movie Review : రాధే శ్యామ్ మూవీ ఫస్ట్ రివ్యూ , ప్రస్తుతం ప్రపంచమంతా రాధే శ్యామ్ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ.. కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు మార్చి 11న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ షోలను యూఎస్ లో ఏర్పాటు చేశారు.
మనకంటే ముందే యూఎస్ లో తెలుగు ప్రేక్షకులు సినిమాను చూసేస్తారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సాహో తర్వాత వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిందే. దాదాపు మూడు ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.
Radhe Shyam Movie Review : సినిమా పేరు : రాధే శ్యామ్
నటీనటులు : ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణం రాజు తదితరులు
డైరెక్టర్ : రాధా కృష్ణ కుమార్
ప్రొడ్యూసర్ : యూవీ క్రియేషన్స్
మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్
రన్ టైమ్ : 2 గంటల 18 నిమిషాలు
రిలీజ్ డేట్ : 11 మార్చి 2022
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సాహో తర్వాత వస్తున్న మూవీ రాధే శ్యామ్. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న రిలీజ్ కాబోతోంది. అయితే.. ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేశారు.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తో పాటు టీ సిరీస్ నిర్మించింది. తెలుగు వర్షన్ కోసం ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. హిందీ వర్షన్ కోసం సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా కంపోజ్ చేశారు.
Radhe Shyam Movie Review : ఈ సినిమా లైవ్ అప్ డేట్స్ ఇవే
సినిమా ప్రారంభమే ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభం అవుతుంది. అంటే 1976 లో అన్నమాట. నవంబర్ 1976 లో ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రారంభం అవుతుంది.
ఈ సినిమాలో హీరో ప్రభాస్ పేరు విక్రమాదిత్య. సత్యరాజ్ దగ్గర హస్తసాముద్రికం అనే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు. ఆయన వద్ద విద్యార్థిగా ఉంటాడు. ఆ తర్వాత ఇండియా నుంచి విక్రమాదిత్య ఫారెన్ కంట్రీకి వెళ్తాడు. అప్పుడే ఇందిరా గాంధీ.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటిస్తారని ఊహిస్తాడు. ఆ తర్వాత సంచారీ పాట వస్తుంది. విదేశాల్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఆ పాట ఉంటుంది.
విక్రమాదిత్య చాలా స్టయిలిష్ గా ఉంటాడు. విక్రమాదిత్య తల్లి భాగ్యశ్రీ. ట్రెయిన్ లో విక్రమాదిత్యకు పూజా హెగ్డే(ప్రేరణ) పరిచయం అవుతుంది. చూసి చూడంగానే విక్రమాదిత్య.. ప్రేరణ ప్రేమలో పడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. ఆ తర్వాత బస్సులో కూడా కలుసుకుంటారు. ఇద్దరి మధ్య చాలా సీన్స్ వస్తాయి. ఆ తర్వాత నీ రాతలే అనే పాట ప్లే అవుతుంది. ఇటలీలో ఈ సాంగ్ ను షూట్ చేశారు. అన్నీ సూపర్ షాట్స్. బ్యూటిఫుల్ షాట్స్.
ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన జగపతిబాబును విక్రమాదిత్య కలుస్తాడు. జగపతిబాబు.. బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తాడు. చాలా ధనవంతుడు. అతడిని కలిసినప్పుడు అతడికి రాజకీయాల్లో భవిష్యత్తు లేదని విక్రమాదిత్య తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమాదిత్యకు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చుతారు. అదే హాస్పిటల్ లో ప్రేరణ కూడా పనిచేస్తుంది. దీంతో హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు విక్రమాదిత్య.. ప్రేరణను లవ్ చేస్తూ ఉంటాడు. వాళ్ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తాయి.
హాస్పిటల్ లో కొన్ని రోజులు విక్రమాదిత్య చికిత్స తీసుకోవడం కోసం ఉండటం.. వాళ్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో ప్రేరణ కూడా విక్రమాదిత్యను ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాధే శ్యామ్ పాట ప్లే అవుతుంది. ఆ తర్వాత విక్రమాదిత్య ఓ ట్రెయిన్ యాక్సిడెంట్ ను ముందే ఊహిస్తాడు. ఆ తర్వాత ట్రెయిన్ యాక్సిడెంట్ జరుగుతుంది. తన హస్తసాముద్రికం గురించి ప్రేరణకు కూడా నమ్మకం ఉంటుంది.
అయితే.. కొన్ని రోజులకు పూజకు ఆరోగ్యం బాగుండదు. హాస్పిటల్ లో చేరుతుంది. దీంతో తను ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు చెబుతారు. 2 నెలల కంటే ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు అంటారు. కానీ.. విక్రమాదిత్య మాత్రం తను నిండు నూరేళ్లు బతుకుతుందని చెబుతాడు.
Radhe Shyam Review : ఫస్ట్ హాఫ్ రిపోర్ట్
ప్రేరణకు ఏం కాదు.. తను నిండు నూరేళ్లు బతుకుతుందని విక్రమాదిత్య నమ్ముతాడు. ఆ తర్వాత ఇంటర్వల్ కార్డు పడుతుంది. మొత్తానికి సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాలోని క్యారెక్టర్ల గురించి పరిచయమే ఉంటుంది. ఆ తర్వాత సైన్స్, హస్తసాముద్రికం.. ఈ రెండింటి మధ్య ఒక సంఘర్షణ ఉండేలా ప్లాన్ చేసి ఫస్ట్ హాఫ్ ను ముగించేస్తాడు డైరెక్టర్. ఇక.. ఫస్ట్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. ఫోటోగ్రఫీ కూడా బాగుంది. సైన్స్, హస్తసాముద్రికం.. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణకు సమాధానాన్ని సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ ఎలా ఇచ్చాడో తెలుసుకోవాలంటే సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే.
సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ప్రేరణ విషయంలో విక్రమాదిత్య ఏదైతే ఊహిస్తాడో అదే నిజం అవుతుంది. ఆ తర్వాత ప్రేరణకు ఓ విషయం తెలుస్తుంది. తన గురించి విక్రమాదిత్య ఏం రాసుకున్నాడో.. తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో విక్రమాదిత్య ఏ రాశాడో తెలుసుకొని షాక్ అవుతుంది. అదే ఈ సినిమాలో అసలు ట్విస్ట్.
ఆ తర్వాత ప్రేరణ ఏం చేస్తుంది.. విక్రమాదిత్యకు ఏమౌతుంది? ప్రేరణ, విక్రమాదిత్య.. ఇద్దరి ప్రేమ గెలుస్తుందా? అనేదే మిగితా సినిమా. ఇప్పటి వరకు భారత సినీ చరిత్రలోనే ఎప్పుడూ చూడని క్లైమాక్స్ షిప్ ఎపిసోడ్ ఈ సినిమాలో చూడొచ్చు. గ్రాఫిక్స్ అదుర్స్. క్లైమాక్స్ మొత్తం ఒక షిప్ లోనే నడుస్తుంది.
కాకపోతే అదంతా గ్రాఫిక్స్. అయినప్పటికీ.. క్లైమాక్స్ ను డైరెక్టర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. మొత్తానికి సినిమా సుఖాంతంగా ముగుస్తుంది. ఫైనల్ రిపోర్ట్, ఫుల్ రివ్యూ కోసం దితెలుగున్యూస్ వెబ్ సైట్ ను ఫాలో అవండి.