RamaRao on Duty Movie Review : మాస్ మహారాజా రవితేజ బిగ్ స్క్రీన్లపై ఆడియన్స్‌ను ఎంతగా అలరిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన శరత్ మండవ డైరెక్షన్‌లో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో రజిషా విజయన్ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా నటించారు. వేణు తొట్టెంపూడి కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకోవడం.. రవితేజ పవర్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో మాస్ మహారాజా ఆ అంచనాలను అందుకున్నాడా..? అనేది చూద్దాం.
RamaRao on Duty Movie Review : కథ
ఇందులో రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపించాడు. అతని పాత్ర ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చింది. అయితే రవితేజ ఏదో విషయంలో సబ్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకొని ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ సమయంలో రవితేజ తన ఊరిలో కొందరు మిస్సింగ్ అయిన విషయాన్ని తెలుసుకుంటాడు. వారందరిని కాపాడుకునే క్రమంలో రవితేజ ఎలాంటి స్టెప్పులు వేశాడు, ఆయన ఎదుర్కోన్న పరిస్థితులు ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

RamaRao on Duty Movie Review : పనితీరు
డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్‌లో హై ఓల్టేజ్ మాస్ డైలాగ్స్‌తో మాస్ మాహారాజా అదరగొట్టేసాడు. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ యాక్టింగ్ హైలెట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ్ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్‌గా ఉంది. శరత్ మండవకు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమానే అయినా.. రవి తేజను సరికొత్తగా చూపించాడని.. కొన్ని డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రవితేజ నుంచి ఊహించే సినిమా కాదని, ఆయన్ని పూర్తిగా ఆవిష్కరించలేదని కూడా చెప్పాలి. దర్శకుడు కొంత పదును పెట్టి ఉంటే బాగుండేది. ఇక మిగతా సాంకేతిక నిపుణులు కూడా తమ పరిధి మేర ప్రతిభ కనబరిచారు
RamaRao on Duty Movie Review : విశ్లేషణ
సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. సినిమా సబ్జెక్ట్ కొత్తగా ఉన్నప్పటికీ రొటీన్ కథనంతో వీక్ గా సాగింది .క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే సామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రవితేజ పెర్ఫార్మన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. రవితేజ ఫ్యాన్స్కి మాంచి కిక్కిచ్చే సినిమా అని చెప్పాలి.
రేటింగ్ : 2.5/5