Khiladi Movie Review : ర‌వితేజ ఖిలాడీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Khiladi Movie Review : ర‌వితేజ ఖిలాడీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

 Authored By sandeep | The Telugu News | Updated on :11 February 2022,10:00 am

Khiladi Movie Review : క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ ..ఏజ్ పెరుగుతున్న కొద్ది జోష్ కూడా పెరుగుతుంది. ఈ కరోనా పాండమిక్ టైమ్ లో కూడా గతంలో డిస్కోరాజ, క్రాక్ లాంటిసినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ ఇపుడు ఖిలాడి సినిమాతో సందడి చేస్తున్నాడు. నేడు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

– 154 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది. – సినిమా ఎంట్రీ మీనాక్షిచౌద‌రితో మొద‌లంది. ర‌వితేజ కూడా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. – ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లారు. మరో హీరోయిన్ డింపుల్ హయాతి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో రవితేజ లవ్ లో ఉన్నాడు. ఇద్దరి మధ్య కొన్ని కామెడీ మరియు రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. – ఏదో స‌మాచారం తెలుసుకునేందుకు ర‌వితేజ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. – విల‌న్స్ ర‌వితేజ ఫ్యామిలీ జోలికి వెళుతున్నారు.

Ravi Teja Khiladi movie review and live updates

Ravi Teja Khiladi movie review and live updates

– ప‌లు స‌మ‌స్య‌ల‌ని సాల్వ్ చేసేందుకు ర‌వితేజ ప్ర‌య‌త్నిస్తున్నాడు.
– రవితేజ ఆ బ్లాక్ మనీ సమస్య లోకి ఎంటర్ అయ్యాడు. తనకి మరియు రావు రమేష్ ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
– బ్లాక్ మనీ ని షిఫ్ట్ చేసే కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే రావు రమేష్ అరెస్ట్ అయ్యారు. ఒక సిబిఐ ఆఫీసర్ గా కథనంలోకి నటుడు అర్జున్ ఇంట్రెస్టింగ్ ఎంట్రీ ఇచ్చారు.
– సినిమాలో మొదటి సాంగ్ ఫుల్ కిక్కు రవితేజ, డింపుల్ హయాతి ల మధ్య స్టార్ట్ అయ్యింది.
– ర‌వితేజ, మీనాక్షి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు వ‌స్తున్నాయి.

– జైల్లో ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. దీనిని డిజైన్ చేసిన విధానం బావుంది.
– మళ్ళీ రవితేజ యాక్షన్ లోకి దిగాడు. ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నట్టుగా సన్నివేశాలు వస్తున్నాయి.
– మరో సాంగ్ క్యాచ్ మీ స్టార్ట్ అయ్యింది.
– రవితేజపై తన గొడవకు సంబంధించి కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టైటిల్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో రవితేజ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

– ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక్కడ నుంచి సినిమా కీలకంగా మారే అవకాశం ఉంది.
– అటాక్స్ వల్ల రవితేజ జైలు కి వెళ్ళాడు. మీనాక్షి అతన్ని బయటకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కథనంలో ఓ ట్విస్ట్.
– ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రవితేజ మరింత క్లారిటీ కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
-ఇప్పుడు ఇంకో ట్విస్ట్ రివీల్ అయ్యింది. యాక్షన్ బ్లాక్స్ తో సినిమా కథనం సాగుతుంది.
– రవితేజ అసలు ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యింది. ఇది మరో ట్విస్ట్ అని చెప్పొచ్చు.
– చిత్రం క్లైమాక్స్ దిశ‌గా సాగుతుంది.
-ట్విస్ట్ అండ్ ఎమోష‌న‌ల్ నోట్‌తో సినిమా ముగిసింది.

పూర్తి రివ్యూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి ..  ఖిలాడీ మూవీ రివ్యూ

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది