Sammathame Movie Review : సమ్మతమే మూవీ రివ్యూ, రేటింగ్..!.. రొమాంటిక్ మూవీస్ ఇష్టపడే వారి కోసం
Sammathame Movie Review : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో దూసుకెళ్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నాడు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం.
కథ : కృష్ణ అనే మిడిల్ క్లాస్ కుర్రాడిగా కిరణ్ కనిపించగా, ఆయన చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. అప్పటినుంచి ఇంట్లో ఆడవాళ్లు ఉంటేనే మంచిదనే భావనతో ఉంటాడు. సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇల్లాలిగా తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు తనను చూస్తేనే చాలు.. అసహ్యించుకునే సాన్వి (చాందిని చౌదరి)ని కలుస్తాడు. ముందు ఆమెతో గొడవలు పడి తర్వాత ప్రేమలో పడతాడు. మెల్లమెల్లగా కృష్ణపై శాన్వికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మళ్లీ గొడవలు ప్రారంభమవుతాయి. మరి చివరకు ఈ ఇద్దరు కలుస్తారా లేదా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్ : కిరణ్ అబ్బవరం తన పాత్రో ఒదిగిపోయాడు. ఈ మూవీలో చాందిని రోల్ కూడా అంత స్ట్రాంగ్ అనిపించలేదు. మిగిలిన రోల్స్ చేసిన నటులు తమ పాత్రకు తగినంతలో నటించి మెప్పించారు. ఇక దర్శకుడు తాను ఎంచుకున్న పాయింట్ మంచిదే కాని, టేకింగ్ కాస్త బెడిసి కొట్టింది. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ పర్వాలేదు. శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదనిపించారు.
ప్లస్ పాయింట్స్, కామెడీ, కిరణ్ అబ్బవరం, మైనస్ పాయింట్స్, టేకింగ్ రిపీట్ సీన్స్,
చివరిగా..
సమ్మతమే నిజానికి అందరితో పూర్తి స్థాయిలో సమ్మతమే అనిపించేలా లేదనే చెప్పాలి. అన్ని లవ్ స్టోరీల మాదిరిగా ఇది కూడా ఉందని చెప్పాలి. ఫస్ట్ హాప్ లో కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రేమాణంతోనే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ చూస్తే.. అంతా ఎమోషనల్ తోనే సాగుతుంది. ఎమోషన్స్ డీలింగ్‌లో దర్శకుడు తడబడినట్టుగా అనిపించింది. ఫ్యామిలీ, రొమాంటిక్ సినిమాలని బాగా ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది.