Vijay Leo Movie Review : విజయ్ ‘లియో’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vijay Leo Movie Review : విజయ్ ‘లియో’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Vijay Leo Movie Review : దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన లియో మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరిని ఢీకొట్టబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూను కొందరు సినీ ప్రముఖుల కోసం వేశారు. లియో సినిమా చూసి విజయ్ ఇరగదీశాడు అని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన […]

 Authored By gatla | The Telugu News | Updated on :19 October 2023,2:00 am

Vijay Leo Movie Review : దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన లియో మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరిని ఢీకొట్టబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూను కొందరు సినీ ప్రముఖుల కోసం వేశారు. లియో సినిమా చూసి విజయ్ ఇరగదీశాడు అని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లియో సినిమా కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో తీశారు. ఇది ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా 12000 స్క్రీన్లలో విడుదల అయింది. భారత్ తో పాటు దుబాయ్, నార్త్ అమెరికా, యూరప్ లో ఈ సినిమాను అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో రిలీజ్ అయింది. ఇక.. ఈ సినిమా వన్ మ్యాన్ షో అంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేశ్ కనకరాజ్ ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించాడని చెబుతున్నారు. ఇక.. అనిరుధ్ మ్యూజిక్ కూడా అదుర్స్ అంటున్నారు.

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలైంది. మరోవైపు విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, అందులోనూ దళపతి హీరో కావడంతో లియోపై కూడా భారీగా అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు ప్రివ్యూ చూసిన వాళ్లు, విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన వాళ్లు సినిమా సూపర్, బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ తర్వాత బెనిఫిట్ షోలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పడ్డాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా గురించి నెగెటివ్ గా కామెంట్లు చేయలేదు. మరోవైపు లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన LCU క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ LCU లో వచ్చిన ఖైదీ, విక్రమ్ మూవీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా లియోను తెరకెక్కించాడు లోకేష్. ఈ మూవీలో బోలెడు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని డైరెక్టర్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాడు. మరి.. నిజంగానే లోకేష్ చెప్పినట్టుగా ఈ సినిమాలో అన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయా? అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది తెలుసుకుందాం.

vijay leo movie review and rating

Vijay Leo Movie Review : సినిమా కథ ఇదే

సినిమా పేరు : లియో

నటీనటులు : దళపతి విజయ్, సంజయ్ దత్, త్రిష, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ తదితరులు

దర్శకత్వం : లోకేష్ కనగరాజ్

సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస

మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుధ్ రవిచంద్రన్

నిర్మాత : లలిత్ కుమార్

విడుదల తేదీ : 19 అక్టోబర్ 2023

ఈ సినిమాలో విజయ్ పేరు పార్థు. కశ్మీర్ లో ఉంటాడు. చాక్లెట్ బేకరీకి ఓనర్. తనే మెయిన్ టెన్ చేస్తుంటాడు.  తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతూ ఉంటాడు పార్థు. ఒకరోజు అతడిపై, తన కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తారు. అసలు.. తనపై, తన కుటుంబ సభ్యులపై ఎందుకు వాళ్లు దాడి చేశారో అర్థం కాదు పార్థుకు. వాళ్లు అసలే గ్యాంగ్ స్టర్స్. వాళ్లకు, తనతో ఎలాంటి శత్రుత్వం లేకున్నా ఎందుకు దాడి చేశారో తెలియక కన్ఫ్యూజ్ అవుతాడు. మరోవైపు పార్థు లాగానే లియో అనే గ్యాంగ్ స్టర్ ఉండేవాడు. అతడు తనలాగే సేమ్ టు సేమ్ ఉంటాడని పార్థుకు తెలుస్తుంది. ఆ తర్వాత లియో గురించి తెలుసుకుంటాడు పార్థు. అసలు లియో ఎవరు.. లియోకు, పార్థుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి.. చివరకు లియోకు ఏమైంది. పార్థు ఆ గ్యాంగ్ స్టర్స్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.

Vijay Leo Movie Review : విశ్లేషణ

ఈ సినిమా మొత్తం కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సాఫీగానే జరుగుతుంది. అందులోనూ పార్థు, అతడి ఫ్యామిలీ మీద దాడి జరిగేంత వరకు అంతా మామూలుగానే ఉంటుంది. కానీ.. ఎప్పుడైతే పార్థు మీద దాడి జరుగుతుందో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. సినిమా కూడా ఆసక్తిగా సాగుతుంది. మరోవైపు అసలు ఇద్దరు హీరోలు ఉన్నారా? లేక పార్థునే లియోలా నటిస్తున్నాడా? ఇద్దరూ ఒక్కరేనా? అనేది తెలియక ప్రేక్షకులు మాత్రం కొంచెం అసహనానికి గురవుతారు. ఏది ఏమైనా.. ఈ సినిమాలో LCU ను లోకేష్ టచ్ చేస్తు. అదికొంచెం ఆసక్తిని కలిగిస్తుంది. సినిమాను మాత్రం తన భుజాల మీద మోశాడు విజయ్. హీరోయిన్ గా త్రిష తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. ఇక.. ఈ సినిమాకు విజయ్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో సీనియర్ హీరో అర్జున్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించారు.

ప్లస్ పాయింట్స్

మ్యూజిక్

ట్విస్టులు

ఇంటర్వెల్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్

ఊహించదగిన కథ

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.5/5

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది