Mother Gold : తల్లి తదనంతరం బంగారం కూతురికి చెందుతుందా..? కోడలికి చెందుతుందా..? ఎవరికి చెందుతుంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mother Gold : తల్లి తదనంతరం బంగారం కూతురికి చెందుతుందా..? కోడలికి చెందుతుందా..? ఎవరికి చెందుతుంది..?

 Authored By tech | The Telugu News | Updated on :2 March 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Mother Gold : తల్లి తదనంతరం బంగారం కూతురికి చెందుతుందా..? కోడలికి చెందుతుందా..? ఎవరికి చెందుతుంది..?

Mother Gold : తల్లి తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తి పాస్తులు కూతురికి వివాహం చేసేటప్పుడు తనకి కట్నంగా కొన్ని ఆస్తిపాస్తులు ఇస్తూ ఉంటారు. తర్వాత మిగిలిన ఆస్తి కొడుకులకి ఇస్తుంటారు. అయితే తల్లి కి ఉన్న బంగారం తను చనిపోయిన తర్వాత కూతురికి చెందుతుందా.? కోడలికి చెందుతుందా.? అనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ప్రస్తుతం ఆర్థిక వైకల్య పరిస్థితికి దీని మీద అవగాహన పెంచుకోవడం అవసరం తల్లి బంగారం తల్లి దాచుకున్న డబ్బు నాకే చెందుతుంది అని కోడలికి కూతురికి మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే మనం దీని గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆర్దిక పరిస్థితి మంచిగా ఉంటే ఈ ప్రశ్న ఎవరి మధ్యలో నడవదు. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు మాత్రం తన అమ్మ బంగారం తనకు దక్కుతుందా.. లేదా.. అనే విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కోడలు కూడా తమ అత్తగారి బంగారం తనకే కావాలి అని అనుకుంటుంది. అలాంటివారు కూడా కొన్ని ఈ విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం చట్టం ప్రకారం సాంప్రదాయం ప్రకారం అలాగే మానవత్వం మూడు రకాలుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా చట్టం ప్రకారం చూసుకుంటే ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ బంగారం చెందుతుంది. కూతుర్లు కొడుకులు ఎంతమంది ఉంటే అంతమందికి వారసులకు ఆమె బంగారం మీద అధికారం ఉంటుంది. స్థలం, ఇల్లు, పొలం లాంటి ఆస్తుల్లో సగం వాటా కొడుకుతో పాటు సమానంగా కూతురి కూడా చెందుతుందని ప్రస్తుతం ఉన్న చట్టం చెబుతోంది.

అదేవిధంగా గోల్డ్ విషయంలో కూడా సగం వాటా కూతుర్లుతూ ఉంటుంది. ఇక సాంప్రదాయం కోణంలో ఆలోచిస్తే వృద్ధాప్యంలో తల్లికి సేవ చేసేది కొడుకు అలాగే కోడలు కావున అత్తగారి బంగారం ఆమె మరణం తర్వాత కోడలికి చెందుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే అత్తగారిని బాగా చూసుకుంటే అత్తగారి గోల్డ్ మీద కోడలికి అధికారం ఉంటుంది. అలాగే కూతురికి ఎందుకు చెందదు అనడానికి ఒక కారణం కూడా ఉంటుంది. కూతురికి డబ్బు ఆస్తి అలాగే బంగారం కట్నం గా ఇస్తూ ఉంటారు. కావున తల్లి దగ్గర మిగిలిన బంగారం మరలా కూతురికి ఇవ్వడం ఎందుకు అని చట్టం ప్రకారం కోడలికి చెందుతుంది అని పెద్దలు అంటున్నారు. అలాగే అత్త గారితో పాటు కలిసి ఉండేదికోడలే కాబట్టి ఆమె బంగారం కోడలికి చెందాలని నియమం సాంప్రదాయంగా నడుస్తుంది. సాంప్రదాయానికి వెళ్తే.. కూతురికి అమ్మ గోల్డ్ మీద హక్కు అనేది అసలు లేదు అయితే చాలామంది మాత్రం అమ్మ బంగారం ఆమె మరణించిన తర్వాత కూతురికే చెందాలని చెప్తుంటారు. ఇక చాలామంది అయితే కోడలికి కూతురికి ఇద్దరికి సమానంగా ఇవ్వాలని అంటుంటారు. అయితే ఇద్దరికి ఇవ్వాలా లేక నచ్చిన వారికి ఇవ్వాలని పూర్తిగా వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లలు తమను పట్టించుకోవడంలేదని చివరి దశలో తమను చూసిన వారికి బంగారం ఇస్తామని తల్లిదండ్రులు చెప్తున్నారు.

అలా అనుకోవడం తప్పేమీ కాదు. కోడలికి కూతురికి బంగారం సమానంగా పంచిచేసి కొడుకు దగ్గరే మిగిలిన జీవితం గడిపితే కొడుకు అన్యాయం అయిపోతాడని వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ కొడుకు కోటీశ్వరుడు అయితే ఇటువంటి ఆలోచన ఉండనే ఉండదు. అయితే ఏ కూలి పని చేసుకునే వ్యక్తి లేక ఏ చిరు ఉద్యోగం అయితే పాపం అతను నష్టమే కదా. కావున తన కొడుకు బాగా చూసుకుంటే బంగారం కోడలికి చెందుతుంది.. ఇక మానవత్వం లో కి వెళ్తే ఈ గోల్డ్ ఆస్తులు డబ్బు ఇవేమి శాశ్వతం కానే కాదు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. బాగున్న అమ్మే ముఖ్యం. ఆ అమ్మే ఒక గోల్డ్ అనుకుంటే కొడుకు గొప్పవాడు అవుతాడు. అత్తగారైతే ఏమైంది తల్లి తర్వాత తల్లి కదా అని అనుకుంటే ఆ అల్లుడు గొప్పవాడిగా ఎదుగుతాడు. మాకు గోల్డ్ కంటే బంధాలే చాలా అవసరమని కూతురు కోడలు ఆడబిడ్డలు అనుకుంటే ఆమెను మించిన అష్టలక్ష్మి ఇంకెవరు దక్కదు. పిల్లలకి తల్లిదండ్రులు జన్మనిచ్చారు. కావున పరిస్థితులు బాగున్న.. బాగా లేకపోయినా వాళ్లని మంచిగా చూసుకోవడం అనేది ముఖ్యం. తల్లిదండ్రులైన సరే జన్మనిచ్చిన బంధానికి ఏమి ఆశించకుండా వారి రుణం తీర్చుకోవడం అదే పెద్ద బంగారం పొందినట్లు భావించాలి..

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది