Women’s Day : మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది .. ? అసలు దీనిని ఎలా జరుపుకుంటారు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women’s Day : మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది .. ? అసలు దీనిని ఎలా జరుపుకుంటారు..?

 Authored By tech | The Telugu News | Updated on :8 March 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Women's Day : మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది .. ? అసలు దీనిని ఎలా జరుపుకుంటారు..?

Women’s Day : నిజానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక దినోత్సవం నుంచి పుట్టుకొచ్చింది.ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి దీనిని గుర్తించి ఏటా నిర్వహిస్తుంది.దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి.తక్కువ పనిగంటలు, మెరుగైన వేతనం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ లో 15వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు.ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909 లో జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించింది.నిజానికి మహిళా దినోత్సవం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని ఆలోచన క్లారా జెట్కిన్ అనే కమ్యూనిస్టు ఉద్యమకారిణిది. 1910 లో క్యూపన్ హెడ్ లో జరిగిన మహిళ అంతర్జాతీయ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. 1910 లో ఇంటర్నేషనల్ సదస్సులో ప్రతిపాదించిన క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తొలిసారిగా 1911 లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు.

అయితే 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. పనిచేసే వయసున్న మహిళల్లో సగం మంది ప్రపంచ కార్మిక శక్తిలో భాగమై ఉన్నారని యూనియన్ గణాంకాలు చెబుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు ఎంత మేరకు ఎదిగారో, ఇంకా ఏ ఏ సవాళ్లు ముందు ఉన్నాయా గుర్తు చేసుకుని వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్ష, పితృసామ్య ధోరణిలతో సమాజంలో అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు తెలపడం ఈ దినోత్సవం యొక్క అసలు ఉద్దేశం. ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒక నిర్దిష్టమైన తేదీ ఉండాలని క్లారా జెట్కిన్ భావించలేదు. 1917 విప్లవం సమయంలో రష్యా మహిళలు ఆహారం శాంతి భద్రతకు డిమాండ్ చేస్తూ సమ్మెకి దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా చక్రవర్తి నికోలస్ జార్ 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

అప్పుడే ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును కల్పించింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు రష్యా అనుసరించిన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మార్చి 8. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు గ్రేగోరియన్ క్యాలెండర్ అమలులో ఉంది కనుక మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అలాగే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉంది. అది నవంబర్ 19న. 1995 వ సంవత్సరం నుంచి దీనిని పాటిస్తున్నారు. కానీ దీనికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లేదు. 60 కి పైగా దేశాల్లో ఏటా పురుషుల దినోత్సవం జరుపుకుంటున్నారు. పురుషులు బాలురు ఆరోగ్యం పై దృష్టి పెట్టడం లింగ సంబంధాలను మెరుగుపరచడం సమానత్వాన్ని ప్రోత్సహించడం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క ఉద్దేశం. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రష్యా సహా పలుదేశాలను జాతీయ సెలవు గా ప్రకటించారు. దినోత్సవానికి ముందు తర్వాత మూడు రోజులు పూల కొనుగోలు ఎక్కువ జరుగుతాయి. చైనాలో చాలామంది మహిళలకు సగం రోజు సెలవు ఇస్తారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది