Ind vs Pak : భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ముందు అసదుద్దీన్ హైటెన్షన్ వ్యాఖ్యలు..!
Ind vs Pak : మరి కొద్ది నిమిషాలలలో టీ 20వరల్డ్ కప్ వేదికగా భారత్ పాక్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ ఆడటానికి భారత్.. పాకిస్తాన్‌కు వెళ్లదు.. సరే.. మరి అదే జట్టుతో ఆస్ట్రేలియాలో ఆడటం ఎందుకు? ఆడకండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు హట్ టాపిక్‌గా మారాయి. వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన ప్రకటనపై ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ మాట్లాడుతూ..
మీరు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? ఆడకుండా ఉండాల్సింది. వద్దు, మనం పాకిస్తాన్‌కు వెళ్లం, కానీ, వారితో ఆస్ట్రేలియాలో ఆడుతాం. అసలు పాకిస్తాన్‌తో ఆడుకుండా ఏమయ్యేది? 2000 కోట్ల నష్టమా? కానీ, భారత ప్రయోజనాల కంటే కూడా ఇది ఎక్కువనా? వదిలిపెట్టండి, రేపు ఆడకండి.’ అంటూ సూటిగా మాట్లాడారు. ఇక పాకిస్తాన్‌పై భారత గెలవాలని తాను కోరుకున్నారు. ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసేందుకు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తమవంతు కృషి చేయాలని కోరుకుంటున్నానని అసదుద్దీన్ అన్నారు. భారత్ ఓడిపోతే మాత్రం ముస్లిం క్రికెటర్లపై నింద వేయొద్దన్నారు.
Ind vs Pak : ఇలా అనేశాడేంటి..
‘భారత్ గెలిస్తే జబ్బలు చరుకునే వాళ్లు ఓడిపోగానే ఆ తప్పుకు కారణం ఎవరిదో వెతకడం మొదలుపెడతారు. మీకు మా హిజాబ్, మా గడ్డంతో పాటు మా క్రికెట్‌తో కూడా సమస్య ఉందా?’ అని ఆయన వ్యాఖ్యానించారు. బీసీసీఐ సెక్రెటరీ జై షా కామెంట్‌తో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై చర్చ మొదలైంది. ఆసియా కప్, వరల్డ్ కప్‌ల వరకూ చర్చ వెళ్లింది.ఈరోజు భారత్ పాక్ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో జై షా కామెంట్లు పెద్ద డిబేట్‌ను లేపాయి ఇక మ్యాచ్ విషయానికి వస్తే మరి కొద్ది నిమిషాలలో మ్యాచ్ మొదలు కానుంది. వరల్డ్ కప్‌లో ఇది రెండు టీంలకి తొలి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.