BCCI : ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ….. క్రికెటర్లకు పండగే….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BCCI : ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ….. క్రికెటర్లకు పండగే….!

BCCI : ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూనే ఉన్నారు. బిజినెస్, స్పేస్, పొలిటికల్ లీడర్స్ , ఇలా చెప్పుకోదగ్గ అన్ని రంగాల్లో వారు రాణించలేని దంటు లేదు. మన భారతదేశంలోనే ఎంతోమంది ప్రపంచం గర్వించదగిన మహిళా మణులు ఉన్నారు. వీరు పురుషులకు ఏమాత్రం తీసిపొకుండా అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. వారి ఆత్మ అభిమానాన్ని కాపాడుకోవడానికి వారి కాలపై వారు నిలబడడానికి మహిళలు ఏమాత్రం భయం లేకుండా ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 December 2022,1:00 pm

BCCI : ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూనే ఉన్నారు. బిజినెస్, స్పేస్, పొలిటికల్ లీడర్స్ , ఇలా చెప్పుకోదగ్గ అన్ని రంగాల్లో వారు రాణించలేని దంటు లేదు. మన భారతదేశంలోనే ఎంతోమంది ప్రపంచం గర్వించదగిన మహిళా మణులు ఉన్నారు. వీరు పురుషులకు ఏమాత్రం తీసిపొకుండా అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. వారి ఆత్మ అభిమానాన్ని కాపాడుకోవడానికి వారి కాలపై వారు నిలబడడానికి మహిళలు ఏమాత్రం భయం లేకుండా ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ క్రీడలో పురుషులకు సమానంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తుంది బీసీసీఐ. తాజాగా ఇప్పుడు మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది బిసిసిఐ.

ఈ నిర్ణయం క్రీడా మహిళలకు పెద్ద ఎత్తున పీట వేస్తుందని బిసీసీఐ చెప్పుకొస్తుంది. అయితే బీసీసీఐ గత కొద్ది రోజుల నుండి సంచలనమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితమే పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లకు కూడా సమానంగా జీతాలు చెల్లిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయం క్రీడా ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా చాలామంది అభిప్రాయం వక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది బీసీసీఐ. అయితే ఒకప్పుడు చూసుకుంటే క్రికెట్ కేవలం పురుషులు మాత్రమే ఆడేవాళ్లు. కొన్ని గణనీయమైన మార్పుల వలన ఇప్పుడు మహిళలు కూడా క్రికెట్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టింది బీసీసీ.

BCCI unexpected decision for women cricketers

BCCI unexpected decision for women cricketers

అయితే ఇప్పుడు చరిత్రలోనే మొదటిసారిగా పురుషుల క్రికెట్ మ్యాచ్ లోకి మహిళ అంపేర్ లను తీసుకురాబోతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. త్వరలోనే ప్రారంభం కానున్న దేశవాలి రంజిత్రోఫీలో మహిళా అంపైర్ లు కనిపించే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది. అలాగే రానున్న రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్లో కూడా మహిళా అంపేర్లు కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం బృందావతి,గాయత్రి జనని తోపాటు మరి కొంత మంది మహిళల ఎంపైర్లు ఉన్నారు. గత కాలంలో గాయత్రి రంజిత్రోఫీలో కూడా ఎంపైర్ గా సేవలను అందించింది. ఇక బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది