MI vs DC : ముంబై, డీసీ మ్యాచ్‌లో ఈ బ్లండర్ మిస్టేక్ గమనించారా.. మండిపడుతున్న ఫ్యాన్స్
ప్రధానాంశాలు:
MI vs DC : ముంబై, డీసీ మ్యాచ్‌లో ఈ బ్లండర్ మిస్టేక్ గమనించారా.. మండిపడుతున్న ఫ్యాన్స్
MI vs DC : ఐపీఎల్ హంగామా ఏ రేంజ్‌లో సాగుతుందో మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచ్ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. ఆదివారం రోజు రెండుమ్యాచ్‌లు జరగగా, ఆ రెండు మ్యాచ్‌లు కూడా చాలా ఆసక్తికరంగా సాగాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచింది. దీంతో టీ20లలో 150 విజయాలు సాధించిన తొలి టీమ్‌గా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది.ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏంటంటే.. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయకుండా 234 పరుగుల భారీ స్కోర్ చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అంతేకాకుండా ఐపీఎల్‌లో ఒకే వేదికగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగానూ ముంబై ఇండియన్స్ అవతరించింది.
నిద్ర లేవండి రా బాబు..
MI vs DC : వాంఖడే మైదాన సిబ్బంది ఘోర తప్పిదం
ఈ మ్యాచ్‌లో ముందుగా ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మొదట్లో రోహిత్ శర్మ(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ఇషాన్ కిషన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42),నిప్పులు చెరగగా, ఆ తర్వాత రోమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చేసి ముంబైకి మంచి విజయం దక్కేలా చేశాడు. అయితే ముంబైకి ధీటుగా ఢిల్లీ ఆడే ప్రయత్నం అయితే చేసింది. పృథ్వీ షా(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), ట్రిస్టన్ స్టబ్స్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 71 నాటౌట్) రాణించినా కూడా ఆ జట్టు విజయతీరాలకి చేరుకోలేక ఢీలా పడింది.
ఢిల్లీ విజయానికి 20 ఓవర్లలో 235 పరుగులు అవసరమైన సమయంలో వాంఖడే మైదాన సిబ్బంది ఈ విషయంలో ఘోర తప్పిదం చేశారు. మైదానంలోని స్కోర్ బోర్డులో ఢిల్లీ విజయానికి 235 పరుగులు కావాలని రాయడానికి బదులు ఢిల్లీ క్యాపిటల్స్ 235 పరుగుల తేడాతో గెలిచిందని పేర్కొన్నారు. ఈ బ్లండర్ మిస్టేక్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ వేదికగా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘ఇది నిజమైతే ఇంతకన్నా షాక్ లేదు’అని కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు మాత్రం వాంఖడే మైదాన సిబ్బందిపై తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. కొంచెం నిద్రలేవండి బాబు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.