Ambati Rayudu : అగ్రెసివ్ తో కప్ గెలవలేరు.. కోహ్లీపై అంబటి రాయుడు దారుణ విమర్శలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ambati Rayudu : అగ్రెసివ్ తో కప్ గెలవలేరు.. కోహ్లీపై అంబటి రాయుడు దారుణ విమర్శలు..!

 Authored By aruna | The Telugu News | Updated on :23 May 2024,8:04 pm

Ambati Rayudu : అంబటి రాయుడు ఆర్సీబీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా చెన్నైపై గెలిచినప్పటి నుంచి ఆర్సీబీ టీమ్ ను టార్గెట్ చేస్తున్నాడు. ఇక సీఎస్ కే మీద గెలిచిన తర్వాత అంబటి రాయుడు మాట్లాడుతూ కొన్ని వ్యంగ్యంగా విమర్శలు చేశాడు. ఆయన మాట్లాడుతూ సీఎస్ కే మీద గెలిచినంత మాత్రాన కప్ కొట్టినట్టు కాదని చెప్పుకొచ్చాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ కు ముందు అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆర్సీబీ కప్ కొట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. పోటీలో సీఎస్కే లేదు కాబట్టి కచ్చితంగా గెలుస్తుందని వ్యంగ్యంగా విమర్శలు చేశాడు.

సీఎస్కే మీద గెలిచిన తర్వాత..

అయితే రాజస్థాన్ తో మ్యాచ్ లో ఆర్సీబీ గెలవాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకున్నారు. ఎందుకంటే ఆర్సీబీ ఈ సీజన్ లో పడిలేచిన కెరటంలా దూసుకువచ్చింది కాబట్టి కచ్చితంగా కప్ గెలుస్తుందేమో అని అంతా అనుకున్నారు. అందుకే వేరే టీమ్ ల అభిమానులు కూడా ఆర్సీబీకి సపోర్ట్ చేశారు. ఇక రాజస్థాన్ తో ఆర్సీబీ ఓడిపోగానే నేరుగా అటాక్ చేయడం మొదలు పెట్టాడు అంబటి రాయుడు. సీఎస్కే మీద గెలిచినంత మాత్రాన కప్ గెలవలేరని మరోసారి విమర్శలు గుప్పించాడు. ఆర్సీబీ ఆట తీరుతో గెలవాలి గానీ అగ్రెసివ్ తో కాదంటూ చెప్పుకొచ్చాడు.

#image_title

ఐపీఎల్ కప్ ను ఎవరూ కూడా సెలబ్రేషన్స్ కోసమో, అగ్రెసివ్ తోనే గెలవలేరు అంటూనేరుగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు అంబటి రాయుడు. ఎందుకంటే సీఎస్ కే తో విజయం తర్వాత విరాట్ కోహ్లీ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కామెంట్ చేశాడు. అయితే అంబటి రాయుడు ఇలా ఎందుకు విరాట్ ను టార్గెట్ చేస్తున్నాడనే మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక అంబటి రాయుడు ఇలా విమర్శలు చేయడంతో దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అటు విరాట్ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. అంబటి రాయుడు ఇలా కామెంట్ చేయడం ఎందుకు అని ఫైర్ అవుతున్నారు. కోహ్లీ బాధలో ఉంటే అంబటి రాయుడు ఇలాంటి కామెంట్లు చేయడం ఎందుకు అని విమర్శిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది